ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా  వైరస్ నియంత్రణలో ప్రభుత్వం విజయవంతం అవుతుంది అని చెప్పాలి. ముఖ్యంగా దేశంలోనే అత్యధిక కరోనా  వైరస్ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న రాష్ట్రాలలో  మొదటి స్థానంలో ఉంది  ఆంధ్ర ప్రదేశ్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో  కరోనా  వైరస్ పేషెంట్లకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు.. ఎన్నో  చర్యలు చేపట్టింది జగన్మోహన్ రెడ్డి  సర్కార్. కరోనా  వైరస్ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఎంతో ఆదర్శంగా పని చేస్తూ ముందుకు సాగుతోంది. ఇదే సమయంలో మహారాష్ట్రలో  ఎంత దారుణంగా కేసుల సంఖ్య పెరిగిపోతుంది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కడ ఏకంగా 60 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 

 


 అయితే అత్యధిక కరోనా  వైరస్ నిర్ధారిత పరీక్షలు చేస్తున్నారు రాష్ట్రాల్లో  మొదటి స్థానంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఉంటే అత్యధిక కరోనా  వైరస్ కేసులు నమోదైన రాష్ట్రాలలో మహారాష్ట్ర మొదటి స్థానం లో ఉంది. అయితే ఈ రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పోలిక ఏమిటి అంటే. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మొదటిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. గతంలో ముఖ్యమంత్రులుగా పాలనను చూసి నేర్చుకున్నవారే. ఇలా ఇద్దరు మొదటి సారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టినప్పటికీ జగన్ సర్కారు మాత్రం కరోనా  వైరస్ నియంత్రణలో సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతోంది. 

 


 అయితే  కేవలం కరోనా  వైరస్ అంశంలో  మాత్రమే కాదు అన్ని విషయాలలో.. జగన్ సర్కార్.. తమ లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతోంది. కరోనా  వైరస్ విషయంలో కూడా అలాగే చేసింది. మహారాష్ట్రలో ఉద్ధవ్  సర్కార్ విషయానికి వచ్చేసరికి.. మూడు పార్టీలతో ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి.. హోమంత్రి ఓ మాట...  ముఖ్య మంత్రి ఓ మాట... మిగతా మంత్రుల మాట మిగతా మంత్రుదే . ఎక్కడ సమన్వయం మాత్రం జరగడం లేదు. కరోనా  వైరస్ ను ఎదుర్కోవడంతో సర్కార్ ఎంత దారుణంగా విఫలం అయిందంటే.. మొదటి నుంచి ప్రభుత్వానికి పలు కీలక సలహాలు ఇస్తూ డాక్టర్ గా కొనసాగుతున్న  వ్యక్తి ఏకంగా కరోనా  వైరస్ బారిన పడితే అతనికి కనీసం బెడ్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్ను చూసి ఉద్దవ్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: