మొదట్లో పార్టీ ఫిరాయింపుల కు తమ ప్రభుత్వ హయాంలో ఎలాంటి తావు లేదు అంటూ చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యను ఎమ్మెల్సీలను ఆకర్షిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రత్యక్షంగా వైసీపీ పార్టీలో చేరకపోయినా పార్టీ పరోక్షంగా మాత్రం టిడిపి పార్టీకి దూరంగా వైసీపీ పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు చాలామంది. ఇక మొన్నటికి మొన్న ఏకంగా ఇద్దరు ఎమ్మెల్సీలు సైతం వైసీపీ పార్టీ వైపు వెళ్లడం సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతం ఇలా తమ పార్టీని ధిక్కరించి అధికార పార్టీకి మద్దతు తెలుపుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు టీడీపీ  సిద్ధ మైన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో అటు వైసీపీ పార్టీ పై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తమ ప్రభుత్వ హయాంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ  పార్టీలోకి చేర్చుకున్నప్పుడు జగన్ ప్రస్తుతం తాము పోరాడుతున్నట్లు ఎందుకు పోరాడలేదు అంటూ వ్యాఖ్యానించారు. 

 


 అలా పోరాడక పోవడం జగన్ బలహీనత అంటూ విమర్శించారు. అందువల్లే గతంలో వైసీపీ  పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టిడిపి పార్టీలో చేర్చుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం పోరాడలేదు అంటూ టీడీపీ ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతం వైసీపీ పార్టీకి మద్దతు తెలుపుతున్న పోతుల సునీత,  శివానందరెడ్డి కుంటిసాకులు చెబుతూ మండలి చైర్మన్ ఎదుట విచారణకు హాజరు కాకుండా తప్పించుకుంటూ ఉన్నారని టిడిపి ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పోతుల సునీత శివనాథ్ రెడ్డి లకు సంబంధించిన సంజాయిషీ పేపర్ ను తాము స్వీకరించామని... వాటిని పరిశీలించిన అనంతరం అడిషనల్ కౌంటర్ దాఖలు చేస్తామని వెల్లడించారు. 

 


 టిడిపి పార్టీ ని దిక్కరించి వైసీపీ పార్టీకి మద్దతు తెలుపుతున్న పోతుల సునీత,  శివనాధరెడ్డి ల పై అనర్హత వేటు వెయ్యాల ని అంటూ మండలి చైర్మన్కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిగింది అంటూ తెలిపారు. ఇలాంటి కేసులో నాలుగు వారాల్లో చర్యలు తీసుకోవాలని గతంలో మణిపూర్ కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది. ఈ జడ్జ్  మెంట్ కు సంబంధించిన కాపీని కూడా శాసనమండలి చైర్మన్ కు అందించామంటూ టిడిపి ఎమ్మెల్సీలు తెలిపారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చంద్రబాబు సిఫార్సు చేస్తేనే శివనాధరెడ్డి కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని.. అలాంటిది ప్రస్తుతం శివనాధరెడ్డి మాత్రం ఏకంగా ఎమ్మెల్సీ పదవి ఇప్పించిన  చంద్రబాబుకు  వ్యతిరేకంగా టిడిపిని విమర్శిస్తూ వైసీపీకి మద్దతు తెలపడం  దారుణం అంటూ వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: