దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో చైనా, పాకిస్తాన్, నేపాల్ భారత్ కు కొత్త సమస్యలు సృష్టిస్తున్నాయి. భారత్ గతంలో పాక్ ను దృష్టిలో ఉంచుకుని ఆయుధ సామాగ్రిని సమకూర్చుకుంది. ప్రస్తుతం భారత్ చైనాను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు రచిస్తోంది. మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్న సందర్భంలో భారత్ ఒక్కొక్క రంగానికి సంబంధించి వారు శత్రు సైనికులను ఎదుర్కొనేలా సిద్ధం చేస్తోంది. 
 
భారత రక్షణ వ్యవస్థలో భాగమైన నావికాదకం 55,000 మంది భద్రతా సిబ్బందితో నాలుగో అతిపెద్ద నావికాదళంగా ఉంది. కేవలం దేశ రక్షణ కోసమే కాక మనవతా సహాయల కోసం, ప్రకృతి వైపరిత్యాల కోసం నావీ సిబ్బందిని వినియోగిస్తున్నారు. భారతదేశంలో నావీకి సుదీర్ఘమైన చరిత్ర ఉంది. పూర్వకాలంలోనే నౌకాశ్రయాలు, నావికాదళ అధ్యక్షులు ఉన్నారు. కొందరు భారతీయ రాజుల చరిత్రలలో నౌకావ్యవస్థలకు చాలా ప్రాధాన్యత ఉంది. 
 
బ్రిటిష్ ప్రభుత్వం 1946లో 78 ఓడలు, 2000 మంది సిబ్బందిని కలిగి ఉంది. జనవరి 26 1950న భారత్ కు సంపూర్ణ స్వాతంత్రం వచ్చే సమయానికి నౌకాదళానికి ఇండియన్ నావీగా పేరు పెట్టారు. 1961లో ఆపరేషన్ విజయ్ పేరుతో నావీ తొలిసారి యుద్ధంలో పాల్గొంది. భారత్ పాక్ యుద్ధాలలో కూడా నావీ పాత్ర ఎంతో ముఖ్యమైనది. 1965లో జరిగిన భారత్ పాక్ యుద్ధంలో నావీ తీరప్రాంత పరిరక్షణలో కీలక పాత్ర వహించింది. 
 
2004లో సునామీ వచ్చినప్పుడు కొన్ని గంటల్లోనే నావీ 27 నౌకలు, 6 యుద్ధ విమానాలు, 19 హెలికాఫ్టర్లు, 5000 మంది సిబ్బందితో సేవలందించింది. ప్రస్తుతం ఇండియాలో 16 సబ్ మెరైన్ లు ఉన్నాయి. ఆయుధ సంపత్తి పరంగా చూస్తే భారత్ రక్షణ శాఖ తయారు చేసిన ఆయుధాలనే కాక విదేశాల నుంచి కూడా ఆయుధాలను కొనుగోలు చేసి వినియోగిస్తోంది. భారత నావికాదళం ప్రస్తుతం ఇతర దేశాల నావికాదళాలతో పోలిస్తే అత్యంత బెస్ట్ అని చెప్పవచ్చు. ఇతర దేశాల నుంచి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా భారత్ కు ఆర్మీతో పాటు నావీ సిబ్బంది కూడా యుద్ధంలో సహాయసహకారాలు అందించటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: