ప్రస్తుతం అగ్రరాజ్యమైన అమెరికా లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. జాతి వివక్ష కారణంగా అమెరికాలో ఎప్పుడు ఎలాంటి అల్లర్లు జరుగుతాయో ఊహించలేని పరిస్థితి ఏర్పడింది. తెల్లజాతీయులు నల్లజాతీయులు అనే జాతి వివక్ష ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోగంలా పాకీ పోయింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్  కి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఈ సమయంలో ట్రంప్ ని  గద్దెదింపేందుకు ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇక దేశంలో జరుగుతున్న జాతి వివక్ష కు సంబంధించిన అల్లర్లను కంట్రోల్ చేసేందుకు ఏకంగా  సైన్యాన్ని రంగంలోకి దింపేందుకు సిద్దమవుతుంది ప్రభుత్వం. ఇది మరింత సంచలనంగా మారిపోయింది. 

 


 ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్కడి దేశీయ బలగాలను వివిధ రాష్ట్రాలకు అల్లర్లను కంట్రోల్ చేసేందుకు పంపించాడు. కానీ ఆయా రాష్ట్రాల గవర్నర్లు మాత్రం సదరు బలగాలు తమ రాష్ట్రంలో కి ప్రవేశించేందుకు అనుమతించడం లేదు. మరోవైపు ఘర్షణలు లూటీలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం జాతి వివక్ష కారణంగా అందరూ అల్లర్లు చేస్తున్నారు అనటం  కంటే... ఇదే సరైన సమయంగా భావించి విచ్చలవిడిగా బతకాలి అనుకుంటున్న వారు  రోడ్ల మీదికి వచ్చే వారు  ఎక్కువగా ఉన్నారని అంటున్నారు విశ్లేషకులు. ఈ నేపథ్యంలో అల్లర్లను కంట్రోల్ చేసేందుకు సర్కారు  అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక బలగాలను పంపగా  రాష్ట్రాల గవర్నర్లు కావాలనే ఆపుతున్నారు అన్నటువంటి వాదన వినిపిస్తోంది. 

 


 ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన డొనాల్డ్ ట్రంప్... ప్రత్యేక బలగాలను తమ తమ రాష్ట్ర లోకి అనుమతించకపోతే ఏకంగా  సైన్యాన్ని రంగంలోకి దించాల్సి  వస్తుంది అంటూ హెచ్చరించారు. ప్రత్యేక బలగాలను  ఆపే అధికారం రాష్ట్రాలకు ఉన్నప్పటికీ సైన్యాన్ని ఆపే అధికారం మాత్రం రాష్ట్రాలకు ఉండదు. ఏ  గవర్నర్ కూడా తమ రాష్ట్రానికి సైన్యాన్ని రావద్దు అని చెప్పే అధికారం లేదు. అయితే ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సైన్యాన్ని రంగంలోకి దింపడానికి అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా ఈ నిరసనలు కంట్రోల్ లోకి  రావాల్సి ఉంది.. కంట్రోల్ కాకుండా ఇంకా అలాంటి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి అంటే ట్రంప్ తర్వాత ఎలా  ముందుకు  వెళ్తారు అన్నటువంటి ప్రస్తుతం  చర్చ నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: