ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కుంభకోణాల గురించి ఎప్పుడు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అమరావతి నిర్మాణం విషయంలో గ్రాఫిక్స్ చూపించి ప్రజలని మోసం చేశారు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి విషయంలో గత ప్రభుత్వం ఎంతో  అవినీతికి పాల్పడింది అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. ఇదే సమయంలో గతంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో.. చంద్రబాబుకు మద్దతు ప్రకటిస్తూ పొగిడిన ఎన్నో మీడియా సంస్థలు  ప్రస్తుతం చంద్రబాబు పై కాస్త వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్న విషయం తెలిసిందే. 

 


 అయితే చంద్రబాబు ప్రభుత్వ హయంలో ఎంతో అవినీతి  జరిగింది అన్న విషయాన్ని ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థలు ఒక్కొక్కటిగా బయటకు తెస్తున్నారు. తాజాగా ది హిందూ మీడియా సంస్థ చంద్రబాబు అవినీతికి సంబంధించి ఒక వార్తలు ప్రచురితం చేసింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. గతంలోజపాన్  సంబంధించిన  మాకి  సంస్థ... అమరావతి నిర్మాణం కోసం ప్లాన్ రెడీ చేసినప్పటికీ... వివిధ కారణాలతో తాము డ్రాప్ అయ్యామూ  అని చెప్పింది. ఇక ఆ తర్వాత దావోస్ లో  తమను కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని... చంద్రబాబు నాయుడు అడిగితే విజయవాడలో గోల్డ్ రిఫైనరీ కంపెనీ పెట్టడానికి ముందుకు వచ్చిన సమయంలో తమకు ఏకంగా 30 ఎకరాల స్థలాన్ని అప్పుడు ప్రభుత్వం కేటాయించిందని... కానీ అప్పుడు అధికారులు మాత్రం అడుగడుగునా అవినీతి విషయంలో ఎంతగానో ఇబ్బందులకు గురిచేశారు అని  స్విట్జర్లాండ్కు చెందిన గోల్డ్ రిఫైనరీ కంపెనీ ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. 

 


 ఉత్తరాఖండ్లో తమ పరిశ్రమను  స్థాపించినప్పుడు  అక్కడ ఎలాంటి అవినీతికి సంబంధించిన ఇబ్బందులు రాలేదని.. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం... ఎన్నో అవినీతికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొన్నామని  తెలిపింది. అయితే భారత దేశంలోనే అతిపెద్ద గోల్డ్ రిఫైనరీ కంపెనీ విజయవాడ లో పెట్టేందుకు  సిద్ధపడితే... అప్పుడు ప్రభుత్వం.. 30 ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి పెద్ద ఎత్తున అవినీతికి కొమ్ముకాసేసరికి డ్రాప్ అయ్యామనిఅంటూ ది హిందూ ఇంటర్వ్యూలో స్విట్జర్లాండ్కు చెందిన కంపెనీ తెలిపినట్లుగా ఓ వార్త ప్రచురితమైంది. అయితే ఇదే కంపెనీ ప్రస్తుతం జగన్ సర్కార్ కి ఆకర్షితులమై  పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా వస్తున్నట్లు సదరు పత్రిక తెలిపింది  నిజంగానే ఈ కంపెనీ పెట్టుబడి పెడితే జగన్ సర్కార్ విజయం సాధించినట్లు అవుతుందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: