ఇండియాలో కరోనా వైరస్ కేసులు ఉన్న కొద్దీ సూపర్ ఫాస్ట్ గా పెరిగిపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరిలో భయాందోళనలు నెలకొన్నాయి. మొదటిలో కేసులు చాలా తక్కువగా వచ్చిన తరుణంలో అంతర్జాతీయస్థాయిలో ఇండియా కరోనా వైరస్ తో గట్టిగా పోరాడుతోందని ప్రశంసలు కురిపించారు. అయితే ఎప్పుడైతే ఇటీవల లాక్ డౌన్ ఆంక్షలు ఎత్తివేస్తూ  సడలింపులు ఇస్తూ కొంచెం లూజ్ గా మనుషులను వదిలేయటం జరిగిందో ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోయింది. నాలుగో దశ లాక్ డౌన్ ముందు రోజుకి రెండు వేల లోపు దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు బయటపడగా ప్రస్తుతం మాత్రం రోజుకి ఎనిమిది వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

IHG

గత రెండు రోజుల నుండి రోజుకు తొమ్మిది వేలకు పైగా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వాలలో అదేవిధంగా వైద్యుల లో టెన్షన్ నెలకొంది. మొత్తంమీద ప్రస్తుతం ఇండియా లో ఉన్న కరోనా వైరస్ ప్రభావం చూసుకుంటే చాపకింద నీరులా భయంకరంగా వ్యాప్తి చెందుతోంది. మరోపక్క మరణాల సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతున్న తరుణంలో దేశంలో కరోనా వ్యాధి అరికట్టడం సాధ్యమయ్యే పని కాదు అంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

IHG

ఇటువంటి తరుణంలో ‘హెర్డ్ ఇమ్మ్యూనిటి’ ఒక్కటే కాపాడగలదు అని అంటున్నారు. అంటే, వైరస్‌కి ఎక్స్‌పోజ్‌ అవడం, శరీరంలో ఇమ్యూనిటీని డెవలప్‌ చేసుకోవడం అన్న మాట. శరీరంలో ఇమ్యూనిటీపవర్ పెంచే ఆహారాలను ప్రజలు రోజు వారిలో తీసుకునే ఆహారంలో ఉండే విధంగా డైట్ తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతున్నారు. మరోపక్క దేశంలో మరణాల శాతం దేశవ్యాప్తంగా 3 లోపే వుండడం ప్రస్తుతానికి ఊరట అయినా, అది ముందు ముందు పెరిగే అవకాశాల్లేకపోలేదన్న వాదన వినబడుతోంది. ప్రస్తుతం నమోదవుతున్న కేసులు ఈ విధంగానే కొనసాగితే జస్ట్ పది రోజుల్లోనే పది లక్షల కేసులు దేశంలో నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: