భారతదేశంపై మరో దేశం ఆధిపత్యం చలాయించటం ఎప్పటికీ జరగని పని. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ పై మరో దేశం పెత్తనం చలాయించాలని ప్రయత్నించినా అది వృథా ప్రయత్నమే అవుతుంది. చైనా లాంటి దేశాలు అందువల్లే సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించాలని ప్రయత్నిస్తాయే తప్ప దేశాల విషయంలో జోక్యం చేసుకోవు. అమెరికా ఇరాక్ లాంటి దేశాల విషయంలో అక్కడి లోకల్ వాళ్లతోనే ప్రభుత్వం ఏర్పడేలా చేసింది. 
 
అమెరికా తమ క్రింద పని చేసేలా చేస్తోంది కానీ భారత్ లో అలా కుదరదు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇతర దేశాలు కూడా భారత్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తాయి. ఈ విషయాలన్నీ తెలిసినా భారత్ తో చైనా సరిహద్దు వివాదానికి తెర లేపడానికి కారణాలేమిటనే ప్రశ్నకు కొన్ని జవాబులు వినిపిస్తున్నాయి. కరోనా విషయంలో ప్రపంచ దేశాలు చైనాపై విమర్శలు చేస్తున్నాయి. 
 
ఇలాంటి సమయంలో ఈ వివాదం ద్వారా ప్రపంచ దేశాల దృష్టి మరల్చాలని చైనా భావిస్తోంది. పలు దేశాల్లో జరుగుతున్న నిరసనలు జరుగుతుండగా భారత్ లాంటి పెద్ద దేశాన్ని ఢీ కొడుతున్నామని ఆయా దేశాలు భావించాలని చైనా ప్రయత్నిస్తోంది. చైనా సరిహద్దు వివాదంతో పాటు, పాక్ ఉగ్రవాదుల ద్వారా, నేపాల్ మ్యాప్ లో భారత్ లోని కొన్ని భూభాగాలను చూపటం ద్వారా సమస్యలు సృష్టించాలని భావిసోంది. 
 
ఈ విధంగా చేస్తే మనం ఆ సమయంలో చైనాలోని పరిశ్రమలను భారత్ లోకి రప్పించడానికి ప్రయత్నించబోమని చైనా భావిస్తోంది. పరిశ్రమలు చిన్నచిన్న దేశాలకు వెళ్లాలని భావించినా అక్కడ చైనా ఇచ్చిన సదుపాయాలు లభ్యం కావు కాబట్టి ఆ పరిశ్రమలు తిరిగి వెనక్కు వస్తాయని చైనా అభిప్రాయపడుతుంది. పరిశ్రమలను ఆపడం కోసం చైనా ఈ విధమైన సమస్యలను సృష్టిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.                

మరింత సమాచారం తెలుసుకోండి: