జగన్ వైసీపీకి అధినాయకుడు. ఆయన బంపర్ మెజారిటీతో గెలిచారు. పైగా ఏడాదిగా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఇక ఏడాది పాలనలోనే దేశంలో పాపులర్ సీఎం గా ఆయన పేరు తెచ్చుకున్నారు.

 

అయితే అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే వైసీపీలో కూడా లుకలుకలు ఉన్నాయని అర్ధమవుతోంది. సీనియర్లు, పార్టీలో చేరి ఎన్నో ఆశలు పెట్టుకున్న వారు ఇపుడు అసంత్రుప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. అటువంటి వారిలో ముందువరసలో నెల్లూరు జిల్లా పెద్దాయన ఆనం రామనారాయణ రెడ్డి ఒకరు. ఆయన‌ ఉమ్మడి ఏపీలో తిరుగులేని నాయకుడిగా ఉండేవారు. పలుమార్లు  మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు  ఉంది.

 

ఆయన వెంకటగిరి నుంచి గెలిచి వచ్చినా కూడా మంత్రి పదవి దక్కలేదు. అక్కడ నుంచి ఇద్దరికి జగన్ చోటిచ్చారు. వారిలో ఒకరు అనిల్ కుమార్ యాదవ్, మరొకరు మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడు గౌతం రెడ్డి. ఈ ఇద్దరూ యువకులే. జగన్ కి అత్యంత సన్నిహితులే. దీంతో ఆనంతో పాటు, ఇదే నెల్లురు నుంచి గెలిచిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటి వారు కూడా మంత్రి పదవి కోసం అశలు పెట్టుకుని ఆవేదన చెందుతున్నారు.

 

అయితే కాంగ్రెస్ కల్చర్ బాగా అలవాటు అయిన ఆనం మాత్రం ఇమడలేకపోతున్నారులా ఉంది. ఆయన గతంలో కూడా ఒకమారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం వినిపించారు. ఇపుడు ఏకంగా టీడీపీ గొంతుతోనే మాట్లాడుతున్నారు. ఏడాదిలో అభివ్రుధ్ధి ఎక్కడా లేదని విమర్శలు చేస్తున్నారు. తాను ఊరుకోనని నెల్లూరు జిల్లాలో జరిగిన జలదోపిడీకి సమాధానం చెప్పాలని డిమండ్ చేస్తున్నారు.

 


తనకు సరైన సమాధానం రాకపోతే ప్రభుత్వం మీదనే విమర్శలు చేస్తానని, ఎదురునిలిచి పోరాడుతానని కూడా హెచ్చరిస్తున్నారు. ఈ నెల్లూరు పెద్దాయన చిచ్చు ఇప్పట్లో  ఆరేలా కనిపించడలేదు జగన్ ఆయన దారికి తెస్తారో తెలియదు కానీ చూస్తూ ఊరుకుంటే మాత్రం కొంప ముంచేలా ఉన్నారని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: