ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జగన్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. నిత్యం అధికారులతో సమీక్ష, సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని అన్ని రంగాల్లోనూ ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి రాకముందు వరకు జగన్ నిత్యం పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉండేవారు. కీలక నాయకులతో సమీక్షలు చేస్తూ నియోజకవర్గాల వారీగా నాయకుల పనితీరు ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయాలపై దృష్టి పెట్టారు. కానీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో పార్టీ లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి అనే అభిప్రాయం జగన్ లో కనిపించింది. 

IHG

అందుకే మళ్ళీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచే విధంగా జగన్ సరికొత్త విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి రంగంలోకి దిగి పార్టీ నాయకులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, మొదలైన వాటి గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలని సూచించారు. పార్టీ అధికార ప్రతినిధుల పనితీరును పార్టీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తుందని, ప్రస్తుతం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తే మన పార్టీ కి తిరుగు ఉండదు అనే విషయాన్ని విజయసాయిరెడ్డి నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.


 ప్రభుత్వం వరుసగా అనేక విషయాల్లో ఎదురు దెబ్బలు తింటూ ఉండడంతో, ప్రజల్లో పార్టీపై, ప్రభుత్వంపై అపనమ్మకం ఏర్పడకుండా చేయాలని ఈ విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడంతో, త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా ఉంటుందని, అందుకే ఇప్పటి నుంచే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగే విధంగా చేయాలని జగన్ నిర్ణయించబట్టే, ఇప్పుడు ఆ కార్యక్రమాలను విజయసాయిరెడ్డి భుజాన వేసుకున్నారట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: