రాజకీయాలపై తప్ప ఇక ఏ ఇతర విషయాలపైన టీడీపీ అధినేత చంద్రబాబుకు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. నిరంతరం రాజకీయాల్లో మునిగి తేలుతూ, వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచిస్తూ బిజీ బిజీగా ఉంటారు. అయితే కొంతకాలంగా అంటే, వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఎక్కువగా విశ్రాంతి తీసుకునేందుకు సమయం కేటాయిస్తున్నారు. వయసు పైబడడం, అనారోగ్య కారణాలు, ఇవన్నీ ఆయన విశ్రాంతి తీసుకునేందుకు ఒక కారణంగా కనిపిస్తోంది. ప్రస్తుతం చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉన్నారు. లాక్ డౌన్ నిబంధనలు విధించక ముందే ఆయన హైదరాబాదులో తన నివాసంలో ఉండిపోయారు. ఇక ఆ తర్వాత కూడా అక్కడే ఉండిపోయారు. ఏపీలో ఆ సమయంలో అనేక సంఘటనలు జరిగినా బాబు ఏపీకి వచ్చేందుకు ఆసక్తి చూపించలేదు. 

 

IHG

ఇటీవల విశాఖలోని ఎల్జి పాలిమర్స్ బాధితులను పరామర్శించేందుకు అనుమతి తీసుకున్నా, అక్కడికి వెళ్లకుండా అమరావతి కి పరిమితం అయిపోయారు. ఇక అక్కడ మహానాడును నిర్వహించిన తర్వాత మళ్ళీ హైదరాబాదుకి చంద్రబాబు వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఏపీలో కరోనా వైరస్ ఎక్కువగా ఉండడంతో హైదరాబాదులో ఉంటూనే జూమ్ యాప్ ద్వారా చంద్రబాబు నిరంతరం పార్టీ శ్రేణులతో అందుబాటులో ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారట. ప్రస్తుతం ఏపీకి వచ్చినా, బాబు చేసేందుకు ఏమీ లేదని, అందుకే హైదరాబాదుకి పరిమితం అవ్వాలని, అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఏపీకి వచ్చే విధంగా చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

IHG


 ప్రస్తుతం హైదరాబాదులోనే చంద్రబాబు విశ్రాంతి తీసుకుంటూ గడపడం మేలని వైద్యులు కూడా సూచించడంతో ఎక్కువ విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యంపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ కార్యక్రమాలు అంటూ, ఏపీకి వచ్చినా, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు గుమిగూడడం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ ప్రస్తుత పరిస్థితుల్లో ముప్పు కలిగించే అంశాలు కావడంతో చంద్రబాబు హైదరాబాద్ లోని తన ఇంటికే పరిమితం అవ్వాలని డిసైడ్ అయినట్లు, ఇక చుట్టం చూపుగా మాత్రమే ఏపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: