ప్రస్తుతం నేటికాలంలో డబ్బు పలుకుబడి ఉంటే తప్పు చేసి కూడా శిక్ష పడకుండా తప్పించుకోవచ్చు అని ఎందరో నిరూపిస్తున్నారు.. కానీ ఆ సమయంలో నిజాయితీగా ఉండే అధికారులు ఉంటే మాత్రం నిందితులు తప్పించుకోవడం కొంచెం కష్టమే అవుతుంది.. ఇక ఈ మధ్య కాలంలో ప్రకృతిని నాశనం చేయడంలో ప్రతి వారు పోటీపడుతున్నట్లుగా కనిపిస్తుంది.. ముఖ్యంగా పచ్చని చెట్లను నరుకుతుంటే అడ్డు చెప్పేవారు కరువైయ్యారు.. మనిషికి స్వచ్చమైన గాలి కావాలి కానీ ఆ గాలిని పంచే చెట్లు మాత్రం ఉండకూడదు.. ఎంత స్వార్ధజీవి.. ఇకపోతే ఇక్కడ ఒక వ్యక్తి చెట్లు నరికివేశాడని రూ.9 లక్షల భారీ జరిమానా విధించిన ఘటన వెలుగులోకి వచ్చింది..

 

 

అదేంటో చూస్తే.. మొహాలీలోని మీర్జాపూర్ అడవిలో సిల్వికల్చర్‌లో భాగంగా దాదాపు 6 వేల ఖేర్‌ చెట్లను నరికేందుకు కాంట్రాక్టర్‌కు అటవీ శాఖ అనుమతి ఇచ్చింది. అతని పేరు కపిల్‌ శర్మ.. అయితే ఇతను నిబంధనలు ఉల్లంఘించి మరో 300 చెట్లను అధికంగా నరికాడని ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు అందింది. ఆ వెంటనే రంగంలోకి దిగిన పంజాబ్‌ విజిలెన్స్‌ బ్యూరో అధికారులు చేసిన విచారణలో ఇతను 300 చెట్లను నరికినట్టు తేలింది.. ఈ క్రమంలో అతనికి రూ.9 లక్షల జరిమానా విధించారు. కాగా సెక్యూరిటీ డిపాజిట్‌ కింద అతడు జమ చేసిన డబ్బులో నుంచి ఇప్పటికే రూ. 5.72 లక్షలను కట్‌ చేసినట్లు, అతడి నుంచి మరో మూడున్నర లక్షలు త్వరలోనే వసూలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు..

 

 

అయితే ఈ జరిమాన విషయంలో  కాంట్రాక్టర్ కపిల్‌ శర్మ మాట్లాడుతూ, దీని గురించి తనకేమీ సమాచారం లేదని, పొరబాటున కార్మికులు ఈ తప్పు చేసి ఉంటారు అని వాపోయాడు.. అంతా జరిగాక ఇప్పుడు నోరు బాదుకుంటే పోయిన డబ్బులు వెనకకు తిరిగి రావు కదా, అందుకే ఇలాంటి పెద్దపనుల్లో ఏ మాత్రం ఎమరుపాటుగా ఉన్నా నష్టం చూసారుగా ఎంత భారీగా ఉంటుందో అని అంటున్నారు నెటిజన్స్.. 

మరింత సమాచారం తెలుసుకోండి: