విద్య, వైద్య రంగాలపై ప్రభుత్వంచేస్తున్న ఖర్చును ఖర్చుగా చూడకూడదు. అది సమాజంపై పెట్టుబడిగా చూడాలి అంటారు సామాజిక వేత్తలు. ఇప్పుడు ఏపీలో జగన్ సర్కారు చేస్తున్నది అక్షరాలా అదే.. జగన్ అధికారంలోకి వచ్చాక విద్యారంగంపై దృష్టి సారించాడు. అఖిల భారత సర్వీసుల్లో పనిచేసిన ఆదిమూలపు సురేశ్ కు విద్యాశాఖ అప్పగించారు. కిందిస్థాయి నుంచి వచ్చిన సురేష్.. బడుగు వర్గాల జీవితాల్లో మార్పుకు విద్య మంచి పరికరం అని గుర్తించారు.

 

 

అందుకే వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నారు. పాఠశాలల రూపురేఖలు మార్చేస్తున్నారు. అయితే ఇందుకు జగన్ సర్కారు కేజ్రీవాల్ సర్కారు పద్ధతిని ఫాలో అవుతోందనే చెప్పాలి. ఢిల్లీలో మరోసారి అఖండ మెజారిటీతో అరవింద్ కేజ్రీవాల్ గెలిచేందుకు ఈ ప్రభుత్వ పాఠశాలల విజయం కూడా ఓ కారణమే. ఇంతకీ ఢిల్లీలో ఏం జరుగుతుందంటే.. ఢిల్లీ విద్యావ్యవస్థ విజయవంతం కావడానికి మూడు కారణాలు ఉన్నాయి.

 

 

అందులో మొదటిది మౌలిక సదుపాయాల కల్పన. కేజ్రీవాల్ ప్రభుత్వం విద్యకు బడ్జెట్ లో 25% కేటాయించింది. ఢిల్లీలో మొత్తం వెయ్యి ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 15 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మరిన్ని మున్సిపల్ పాఠశాలలు నడుస్తున్నాయి. ఇక్కడ కేవలం ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ పాఠశాలలకు క్రేజ్ ఉండటం విశేషం. ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం చేసిన పని పాఠశాలలకు మంచి మౌలిక వసతులు కల్పించడం.

 

 

ఇప్పుడు జగన్ సర్కారు కూడా అదే చేస్తోంది. దాదాపు 6 వేల కోట్లు వెచ్చించి పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు నిర్ణయించింది. కేజ్రీవాల్ సర్కారు ఈవిషయంలో ఘన విజయం సాధించింది. మరి ఇంత పెద్ద రాష్ట్రమైన ఏపీలో జగన్ సర్కారు ఎలాంటి ఫలితాలు అందుకుంటుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: