చంద్రబాబు నాయుడు.. ఉమ్మడి ఏపీని ఎక్కువ కాలం పాలించిన నాయకుడిగా రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఏపీని దాదాపు 9 ఏళ్లు పాలించిన చంద్రబాబు విభజిత ఏపీకి అంటే నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలో.. ఒకసారి సీఎంగా ఉండి కూడా ఎన్నికల్లో ప్రజాతీర్పు నెగ్గి మరోసారి సీఎం అయ్యారు చంద్రబాబు. కానీ నవ్యాంధ్రలో మాత్రం అధికారాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారు.

 

 

తనకన్నా వయస్సులో ఎంతో చిన్న వాడైన యువ నాయకుడు జగన్ చేతిలో ఘోరంగా పరాజయం పాలయ్యారు చంద్రబాబు. ఇది తన రాజకీయ జీవితంలోనే అతి దారుణమై ఓటమిగా చెప్పుకోవచ్చు. అయితే ఓటమిని ఒక పట్టాన అంగీకరించని మనస్తత్వం చంద్రబాబుది అందుకే జగన్ సర్కారుపై విమర్శల జోరు పెంచేస్తున్నారు. 2024 ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారని చెప్పుకోవచ్చు.

 

 

అయితే వైసీపీ నేతలు మాత్రం చంద్రబాబుకు ఇక ముఖ్యమంత్రి యోగం లేదని అంటున్నారు. వైయస్‌ఆర్‌ చనిపోబట్టి.. వైయస్‌ జగన్‌ను చంద్రబాబు, సోనియా గాంధీ కలిసి ఇబ్బందులు పెట్టబట్టి టీడీపీకి ఒక్కఛాన్స్‌ వచ్చిందని అంటున్నారు అంబటి రాంబాబు. ఇక చంద్రబాబు, లోకేష్‌కు అధికారంలోకి వచ్చే ఛాన్స్‌ అసలే లేదని కుండ బద్దలు కొడుతున్నారు.

 

 

జగన్ తన చక్కటి పాలనతో సీ – ఓటర్‌ సర్వేలో స్టు పాపులర్‌ సీఎంల జాబితాలో 4వ స్థానాన్ని దక్కించుకున్నారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్ ఒక్క సంవత్సరకాలంలోనే రూ.40,139 కోట్లతో సుమారు 3.57 కోట్ల మందికి లబ్ధి చేకూర్చారని గుర్తు చేస్తున్నారు. ఒక్కపైసా అవినీతి లేకుండా డైరెక్టుగా లబ్ధిదారుల బ్యాంక్‌ అకౌంట్లకే డబ్బు చేర్చగలిగాంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: