నిన్న డాక్టర్ సుధాకర్ పై సీబీఐ కేసు నమోదైన సంగతి తెలిసిందే. నడిరోడ్డుపై ఇష్టారాజ్యంగా ప్రవర్తించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడనే ఆరోపణలతో సీబీఐ నర్సీపట్నానికి చెందిన అనస్తీషియా డాక్టర్ సుధాకర్ పై కేసు నమోదు చేసింది. బుధవారం రోజున సీబీఐ ఎఫ్.ఐ.ఆర్ కాపీని వెబ్ సైట్ లో పొందుపరిచింది. మే నెల 16వ తేదీన దురుసుగా ప్రవర్తించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని ఫోర్త్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ వెంకట రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు చెబుతున్నారు. 
 
పోలీసుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని.... గతంలో నమోదైన కేసునే టేకోవర్ చేశామని చెప్పి సీబీఐ ట్విస్ట్ ఇచ్చింది. సీబీఐ సీసీ కెమెరా ఫుటేజీను సేకరించడంతో పాటు మే 16వ తేదీన సుధాకర్ కు వైద్య సేవలు అందించిన డాక్టర్ల నుంచి సమాచారం రాబట్టింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన సుధాకర్ పోలీసులపై చేసిన దూషణలను, నిబంధనల ఉల్లంఘనను పరిగణనలోకి తీసుకొని సుధాకర్ పై 188, 357 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. 
 
సుధాకర్ పై సీబీఐ కేసు నమోదు చేయడం టీడీపీకి షాక్ అనే చెప్పాలి. గతంలో ప్రభుత్వం సుధాకర్ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపణలు చేసిన టీడీపీ నేతలు సీబీఐ తాజా కేసుతో డిఫెన్స్ లో పడ్డారు. హైకోర్టు సీబీఐకి సుధాకర్ కేసును అప్పగించిన నేపథ్యంలో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులతో పాటు సీబీఐ సుధాకర్ పై కేసులు నమోదు చేయడంతో ఈ కేసులో సీబీఐ నిష్పాక్షికంగా వ్యవహరిస్తున్నట్టు తెలిలింది. 
 
గతంలో టీడీ, బీజేపీ, జనసేన సుధాకర్ దళితుడు కాబట్టే ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. అయితే తాజాగా సీబీఐ కేసులు నమోదు చేయడంతో విపక్షాలు సైలెంట్ అయ్యాయి. విపక్షాలు హైకోర్టు కేసును సీబీఐకి అప్పగించడంతో సీబీఐ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెడుతుందని భావించాయి. కానీ సీబీఐ ఇరు వర్గాలపై కేసులు నమోదు చేయడంతో విపక్షాలు సైలెంట్ అయ్యాయనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: