మనుషులు ఏ దేశంలో ఉన్న, ఏ ప్రదేశంలో జీవిస్తున్న అందరిలో ఉండేది ఒకే ఆత్మ అన్న విషయం తెలిసిందే.. ఎవరికైనా బాధ కలిగితే కన్నీరే వస్తుంది.. అతను దొంగ కావచ్చూ, దుర్మార్గుడు కావచ్చూ, రాక్షసుడు కావచ్చూ, మరి ఇంకెవరైనా కావచ్చూ, ఇక తప్పుచేసిన వారిని శిక్షించడంలో తప్పులేదు.. కానీ ఈ ప్రపంచంలో తప్పుచేయని వారంటు ఉంటారా.. కొన్ని కొన్ని సందర్భాల్లో అతను చేసిన తప్పు వల్ల ఎవరు నష్టపోనంత వరకు ఫర్వాలేదు.. కానీ నేటికాలంలో మనుషుల్లో అహం, ద్వేషం చాలా పెరిగిపోయి తాము కూడా మనుషులం అన్న విషయాన్ని మరచి ఎదుటి వారిని హింసిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు..

 

 

లోకంలో తప్పులు చేస్తూ సాటి మనుషుల జీవితాలతో నిత్యం చెలగాటం ఆడుతూ జీవించే వారిని మనుషులు అనడం కంటే కౄరమృగాలు అనడం ఉత్తమం.. ఇక ఈ బిరుదును పాకిస్దాన్ దేశం ఎప్పుడో సొంతం చేసుకుందట.. ఇప్పటికే ఉగ్రవాదాన్ని కన్న బిడ్దల్లా సాకుతున్న ఆ దేశం ఆ తప్పును కప్పి పుచ్చుకోవడానికి ఎన్నో నక్కజిత్తులు ప్రదర్శిస్తుంది.. ఇక అక్కడ నివసించే వారు కూడా కౄరులనే విషయం తాజాగా అక్కడ జరిగిన ఒక దారుణం గురించి తెలుసుకుంటే అర్ధం అవుతుంది.. అదేమంటే.. పొట్టకూటి కోసం ఎనిమిదేళ్ల వయస్సులోనే పనిలో కుదిరిన ఓ పాప పొరపాటున చేసిన పనికి ప్రాణాలనే తీశాడు ఆ ఇంటి యజమాని.. పాకిస్థాన్‌లోని రావల్పిండిలో ఉన్న ఒక కుటుంబంలోని ఇంట్లో నాలుగు నెలల క్రితం, ఎనిమిదేళ్ల పాప పనికి కుదిరిందట..

 

 

అయితే తన పనిలో భాగంగా పంజరాలను శుభ్రం చేస్తుండగా అనుకోకుండా పంజరం తలుపు తెరచుకోగానే అందులో ఉన్న చిలుకలు ఎగిరిపోయాయట.. అయితే ఖరీదైన చిలుకలు ఎగిరిపోవడంతో ఆ ఇంటి యజమాని ఆగ్రహించి పాపను విచక్షణ రహితంగా కొట్టగా, పాపం ఆ చిన్నది అపస్మారక స్దితిలోకి వెళ్లగా, ఆమెను ఆసుపత్రిలో చేర్పించిన కాసేపట్లోనే ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారట.. ఏమి తెలియని చిలుకలు ఎగిరిపోతే, అన్ని తెలిసిన మనిషి వాటి కోసం ఒక నిండు ప్రాణం తీయడం అమానుషం.. చిలుకలు పోతే తేవచ్చు కానీ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేం కదా.. 

మరింత సమాచారం తెలుసుకోండి: