కరోనా విషయంలో కేసీఆర్ సర్కారు తీరు ఏమాత్రం బాగా లేదని బీజేపీ తెలంగాణ నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణలో కరోనా పరీక్షలు సరిగ్గా జరగడం లేదని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే కరోనా రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందని హెచ్చిరిస్తున్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఈ విషయంలో కేసీఆర్ సర్కారుపై ఘాటు విమర్శలు చేశారు.

 

 

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 4 లక్షల కరోనా పరీక్షలు జరిగితే.. తెలంగాణలో మాత్రం కేవలం 30 వేల పరీక్షలు మాత్రమే జరిగాయని బిజెపి ఎమ్.పి ధర్మపురి అరవింద్ విమర్శించారు. ఇలా అతి తక్కువ స్థాయిలో కరోనా పరీక్షలు తక్కువ జరగడం ప్రమాదకరమని బిజెపి ఎమ్.పి ధర్మపురి అరవింద్ హెచ్చరించారు. కరోనా కట్టడి కోసం కేంద్రం ఇచ్చిన డబ్బును కూడా కేసీఆర్ సర్కారు దారి మళ్లించిందని అరవింద్ మండిపడ్డారు.

 

 

అంతే కాదు.. కేసీఆర్ పాలన తీరుపై కూడా ధర్మపురి అరవింద్ ఘాటు విమర్శలు చేశారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌లో భారీగా అవినీతికి జరుగుతోందని ఆరోపించారు. రకారకాల నిబంధనల పేరుతో రైతుబంధులో కూడా కోతలు పెడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి చర్యల కారణంగానే ఇటీవల ముఖ్యమంత్రుల సర్వేలో కేసీఆర్‌కు 16వ స్థానం దక్కిందని ఎద్దేవా చేశారు.

 

 

కేసీఆర్ సర్కారు నిధుల దుర్వినియోగం చేస్తోందన్న బీజేపీ ఎంపీ అరవింద్.. కేంద్రం ఇచ్చిన రూ. 11 వందల కోట్ల ఎస్‌డీఆర్‌ఎఫ్‌ నిధులను కూడా కేసీఆర్‌ దారి మళ్లించారని విమర్శించారు. పొరుగు రాష్ట్రం కరోనా కట్టడి విషయంలో చురుగ్గా చర్యలు తీసుకుంటుంటే.. కేసీఆర్ మాత్రం తక్కువ సంఖ్యలో పరీక్షలు చేయిస్తూ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ.

 

మరింత సమాచారం తెలుసుకోండి: