వైసీపీ ప్రభుత్వాన్ని అడుగడుగున ఇబ్బంది పెట్టాలని ఏపీ బీజేపీ నేతలు అడుగడుగున ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం స్థాయిలో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని బిజెపి ముందుకు వెళుతోంది. అయితే ఈ విషయంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వ్యవహరిస్తున్న తీరు బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదు. ఆయన అందరి గవర్నర్ ల కంటే భిన్నంగా వ్యవహరిస్తూ వస్తుండడం, ప్రభుత్వ నిర్ణయాలను యధావిధిగా ఆమోదిస్తూ ఉండటం వంటి పరిణామాలు బిజెపి నేతలు ఇబ్బందికరంగా మారాయి. వాస్తవంగా చెప్పుకుంటే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ గవర్నర్ తీరు బాగుందనే అభిప్రాయం అందరిలోనూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పని , గవర్నర్ పని ఎవరిది వారిదేనని, ఒకరు వ్యవహారాల్లో ఒకరు అతిగా జోక్యం చేసుకోవడం ఎందుకు అన్నట్లుగా ఏపీ గవర్నర్ వ్యవహరిస్తున్నారు. 

IHG

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో బిజెపి ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. కానీ ఆయన్ను మారుస్తూ టిడిపి ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. దీంతో వైసీపీ పై విమర్శలు చేసే అవకాశం ఏపీ బీజేపీ నేతలకు లేకుండా పోయింది. కేంద్ర బిజెపి పెద్దలు ఆమోదం లేకుండానే గవర్నర్ ఆ విధంగా వ్యవహరించారా  ? అనే ప్రశ్న ఎదురవడంతో ఆ విషయంలో కమలనాథులు సైలెంట్ అయిపోయారు. 

IHG


తాము ఏపీ ప్రభుత్వంపై పోరాడే విషయాల్లో  గవర్నర్ ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా వ్యవహరించడంపై ఇప్పటికే కేంద్ర బిజెపి పెద్దలకు ఏపీ బీజేపీ నాయకులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పూర్తిగా పరిశీలించిన కేంద్ర పెద్దలు ఇదే విషయాన్ని గవర్నర్ కి కూడా తెలియజేసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. మరి ఈ విషయంలో గవర్నర్, కేంద్ర బిజెపి పెద్దల రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: