ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీలో కొన్ని కొన్ని వార్తలు సీఎం వైఎస్ జగన్ కి ఇబ్బందిగా మారాయని తెలుస్తుంది. ఇటీవల జరుగుతున్న కొన్ని కొన్ని సమావేశాల్లో కూడా ఆయన కొందరి తీరుపై నేరుగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. పార్టీకి కొందరు సమస్యగా మారారు అని జగన్ నేరుగానే కొందరి వద్ద వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి అనే సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాల్లో సోష‌ల్ మీడియాలో ఎంత కీల‌కంగా పని చేస్తుందో ?  ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. 

 

కొద్ది రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే ఏపీలో వైసీపీ సోష‌ల్ మీడియా వింగ్ వెన‌క‌ప‌డింద‌న్న టాక్ వ‌స్తోంది. తాజాగా జగన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అది ఏంటీ వైసీపీ సోషల్ మీడియా విభాగం మొత్తం కూడా ఒక యువ ఎంపీకి అప్పగించాలని... అలాగే ఆ విషయంలో ఎవరి జోక్యం ఉండకుండా చూడాలి అని భావిస్తున్నట్టు సమాచారం. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఎంపీకి ఈ వింగ్‌ను అప్ప‌గించ‌డంతో పాటు ఇక‌పై నెల‌లో ఒక్క‌సారి అయినా దీనిని తానే స్వ‌యంగా మానిట‌రింగ్ చేయాల‌ని భావిస్తున్నార‌ట‌.

 

వైఎస్ జయంతి కార్యక్రమం రోజున సోషల్ మీడియా విభాగం బాధ్యతలను సదరు ఎంపీ గారికి అప్పగించే యోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎవరూ కూడా జోక్యం చేసుకోవడానికి వీలు లేని విధంగా చూడాలి అని అంటున్నారు. వ్యక్తి ప్రార్ధన అనేది లేకుండా ఉన్న‌ది ఉన్న‌ట్టే మ‌నం సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాల‌ని కూడా జ‌గ‌న్ అన్న‌ట్టు స‌మాచారం. ఇక ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు దూకుడుగా ఉన్న వైసీపీ సోష‌ల్ మీడియా ఇప్పుడు నిస్తేజంగా ఉండ‌డం కూడా జ‌గ‌న్ అస‌హ‌నానికి కార‌ణ‌మైంద‌ని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: