తాజాగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రకటించిన విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో టాక్సీ డ్రైవర్ల అందరికీ వాహన మిత్ర పథకం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగిన జగన్ మోహన్ రెడ్డి వాహన మిత్ర పథకం ద్వారా ఎంతోమంది నిరుపేదలకు చేయూత  ఇచ్చిన విషయం తెలిసిందే. అటు  టాక్సీ ఉన్న వారికి ప్రతి ఏటా పది వేల రూపాయల చెల్లించేలా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇప్పటికే మొదటి విడత ఆర్థిక సాయం అందగా తాజాగా రెండో విడత ఆర్థిక సాయం కూడా అందుకున్నారు ఆటో టాక్సీ యజమానులు. 

 


 ఇక దీనికి సంబంధించి తాజాగా కొంతమంది ఆటో టాక్సీ డ్రైవర్లు వైసీపీ నేతలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో కొంతమంది ఆటో టాక్సీ కార్మికులు సహా మరికొంత మంది వైసీపీ నేతలు పాల్గొన్నారు. అయితే నాలుగు నెలల ముందే వైఎస్సార్ వాహన మిత్ర పథకం ప్రారంభించినట్లు  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇక వాహన మిత్ర ద్వారా రాష్ట్రంలో 2,62, 493 మందికి లబ్ధి చేకూరుతుంది అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు. రెండో విడత వైఎస్ఆర్ వాహనమిత్ర సొమ్మును నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. 

 


 ఈ సందర్భంగా ఓ ఆటో కార్మికుడు   భావోద్వేగంతో మాట్లాడారు. 
 మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. పేదలు తమ పిల్లలను చదివించుకునేందుకు  అమ్మఒడి తో  15వేలు ... మెరుగైనా విద్య  కోసం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం... పిల్లలకు నాణ్యమైన భోజనం కోసం మధ్యాహ్న భోజన పథకం... ఉన్నత చదువులు చదివేందుకు జగనన్న వసతి దీవెన.. ఇలా మీరు ప్రవేశపెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు పేద  ప్రజలకు  వరంలా మారాయి అంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు చాలా మంది ముఖ్యమంత్రులను  చూశాను కానీ ఇలాంటి ముఖ్యమంత్రి మాత్రం మేము ఎప్పుడూ చూడలేదు అంటూ తెలిపాడు ఆటో కార్మికుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: