కేరళలో నిండు గర్భిణిగా ఉన్న ఒక ఆడ ఏనుగును మానవత్వం మరిచిన మనుషులు అతి దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పైనాపిల్ లో దీపావళి బాంబులు పెట్టి ఏనుగుకు ఇవ్వడంతో... తన ఆకలి తీర్చడానికి ఎంతో దయతో పండ్లు ఇచ్చారు అని భావించిన ఏనుగు... అది నోట్లో పెట్టుకోగానే పేలిపోయింది దీంతో తీవ్రంగా గాయపడిన ఎందుకు ఎంతో తల్లడిల్లుతూ పరుగులు పెట్టింది. కానీ ఏ ఒక్క మనిషికి మాత్రం హాని చేయలేదు. బాధ తాళలేక వెళ్లి ఏకంగా గంగమ్మ. దీంతో అక్కడే ప్రాణాలు విడిచింది ఆ ఏనుగు. ఈ ఘటన ఎంతో మందిని కలిచి వేసింది. నిండు గర్భిణిగా ఉన్న ఏనుగును రక్షించడానికి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం మాత్రం లేకుండా పోయింది. మనుషుల్లో మానవత్వం ఎంత దారుణంగా దిగజారిపోయిందో చెప్పడానికి ఈ ఘటన నిదర్శనం గా మారిపోయింది. ఇక ఈ ఘటన మరవక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. 

 


 కేరళలోని మల్లాప్పురం  లో నిండు గర్భిణిగా ఉన్న ఓ ఆడ ఏనుగు హత్య  మరవకముందే అదే కేరళ రాష్ట్రం లు పొలం జిల్లా మదనాపురం అటవీ ప్రాంతంలో మరో ఏనుగు మృతి చెందడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. మదనపురం అటవీ ప్రాంతంలో చనిపోయిన ఏనుగు కూడా... మల్లప్పురం లో చనిపోయిన ఏనుగు మాదిరిగానే చనిపోయి ఉండవచ్చని అధికారులు అనుమాన పడుతున్నాడు.గత కొన్ని  నెలల క్రితం బలహీనంగా ఉన్న ఒక ఏనుగును గుర్తించాము  అంటూ తెలిపిన అధికారులు ఆ ఏనుగును పరిరక్షించేందుకు వెళ్లగా  తమకు సహకరించకుండా కొద్ది దూరం వెళ్ళిపోయింది అంటూ చెప్పుకొచ్చారు. 

 


 కానీ తర్వాత రోజు అది అడవిలో ఓ ప్రాంతంలో చనిపోయినట్టుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇక ఆ ఏనుగు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించామని... దీనికి సంబంధించి నివేదిక కూడా వచ్చినట్లు తెలిపారు అధికారులు. అయితే చనిపోయిన ఆ ఏనుగు దవడ విరిగిపోయినట్లు పోస్టుమార్టంలో తేలింది అంటూ చెప్పారు. తాజాగా మరణించిన ఏనుగు కూడా పేలుడు పదార్థం తిని అవి పేలడం కారణంగానే మరణించి ఉండవచ్చు అని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తాము వైద్య పరీక్షల ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు అధికారులు. అయితే ఇలా వరుసగా మూగజీవాల పై దాడులు జరిగి చనిపోతూ ఉండటం దేశవ్యాప్తంగా సంచలనం గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: