పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా గెలుపొందిన రఘురామ కృష్ణంరాజు వ్యవహారం ఇప్పుడు సొంత పార్టీతో పాటు ప్రజలను చర్చనీయాంశమవుతోంది. పదేపదే ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ జగన్ కు ఆగ్రహం కలిగించే లా వ్యవహరిస్తున్నారు. ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి ఇదే వ్యవహారశైలి తో ముందుకు వెళ్తున్నారు. వైసీపీ తో సంబంధం లేకుండా నేరుగా కేంద్ర బీజేపీ పెద్దలతో సంబంధాలు పెట్టుకుని వారితో సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. ఈ విషయమై గతంలో జగన్ పరోక్షంగా హెచ్చరికలు చేసినా, ఆయన వ్యవహార శైలి లో మార్పు రాలేదు. సరికదా ప్రత్యేకంగా బిజెపి పెద్దలకు ఢిల్లీలో విందు కూడా ఏర్పాటు చేశారు. ఇక అప్పటి నుంచి ఆయన వైసీపీ లోనే ఉన్నా, ఆయన పెద్దగా పట్టించుకోన్నట్లు గానే జగన్ తో పాటు పార్టీ శ్రేణులు వ్యవహరిస్తున్నాయి. 

IHG


వాస్తవంగా ఈ తరహా వ్యవహారాలు జగన్ కు అస్సలు నచ్చవు. అయినా రఘురామకృష్ణంరాజు విషయంలో జగన్ చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో ఆయన మరింతగా ఇప్పుడు విమర్శలు చేయడం మొదలుపెట్టారు. తాజాగా జగన్ ను ఉద్దేశించి వ్యంగ్యంగా  మాట్లాడినట్టే మాట్లాడి విమర్శలు చేశారు. ఇసుక దోపిడీ గురించి మా ముఖ్యమంత్రి జగన్ గారికి తెలియదని, ఆయన మల్లె పువ్వు లాంటి వారని, ఇసుక దోపిడీ గురించి జగన్ గారికి తెలీదని, ఆయన దగ్గరకు మా మాటలు చేరే అవకాశమే లేదని, జగన్ చుట్టూ ముళ్ళకంచె వంటి కోటరీ ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపారు. 

IHG


చాలాకాలంగా రఘురామకృష్ణంరాజు బీజేపీ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే వ్యూహాత్మకంగా వైసీపీ పై విమర్శలు చేస్తే జగన్ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని, అప్పుడు బీజేపీలోకి వెళ్లవచ్చని ఆయన చూస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అలాగే రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యల వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందా అనే కోణంలో ఇప్పుడు వైసిపి నాయకులు ఆరా తీస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: