తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడూ ఒక నిర్ధిష్టమైన ప్రణాళిక పెట్టుకుని దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అది కంప్లీట్ అయిన తర్వాత మిగతా దానిమీద ఫోకస్ పెడతారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో సాగు మరియు తాగునీరు ఎద్దడి తీర్చడానికి కేసిఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పై ఫోకస్ పెట్టడం జరిగింది. దీంతో సాగు మరియు తాగు నీటి కొరతను తగ్గిస్తూ కాలేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టులు చేపట్టి తెలంగాణ పల్లెల్లో కూడా నీటి కొరత తీర్చడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ పల్లెల్లో జలసిరి తో అన్ని కాలువలు కళకళలాడుతున్నాయి. సాగుకు నీటి వసతి ఎక్కువగా పెరగటంతో తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి గిరాకీ ఎక్కువ పెరిగింది.

 

ఇటువంటి విషయంలో వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూనే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆలోచనలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. 'రైతుబంధు' అనే కార్యక్రమం తీసుకువచ్చి తెలంగాణ రైతులకు వెన్నుదన్నుగా నిలవాలని కేసీఆర్ అనేక చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం చెప్పిన రీతిలో ఏ భూమి లో ఎలాంటి పంటలు వేయాలి అన్న దాని గురించి ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటించాలని గతంలో కేసీఆర్ ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. ఈ క్రమంలో అలా చేస్తేనే సదరు రైతు కి రైతుబంధు పథకానికి అర్హుడని అన్నట్టు కండిషన్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి.

 

ఇదిలా ఉండగా ఇటీవల తెలంగాణ ప్రజలు ఎక్కువగా వినియోగించే బంగాళదుంప, అల్లం, వెల్లుల్లి విషయాల్లో దిగుమతి ఎక్కువ చేసుకోవాల్సి వస్తుందని అందుకే వీటిని రాష్ట్రంలో ఎక్కువ పండించే దిశగా కేసీఆర్ అధికారులకు ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారట. ఈ సందర్భంగా అధికారులకు ఈ పంటలు పండించడానికి సాగు విధానాలు ఏమిటి అన్న దానిపై క్లారిటీ ఇవ్వాలని కేసీఆర్ అడిగినట్లు సమాచారం. ఈ విధంగా తాజాగా వెల్లుల్లి, అల్లం, బంగాళదుంప ఈ మూడు పంటలు ఎక్కువగా తెలంగాణలో పండాలని కేసీఆర్ లేటెస్ట్ టార్గెట్ గా పట్టుకున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: