ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. ఈ ఏడాది కాలంలో సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోలోని హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో 90 శాతం హామీలను ఇప్పటికే అమలు చేసిన జగన్ మిగిలిన 10 శాతం హామీలను కూడా అమలు చేయడానికి డేట్లు ఫిక్స్ చేశారు. ప్రజల్లో జగన్ పరిపాలనపై సంతృప్తి వ్యక్తమవుతోంది. 
 
కరోనా కష్టకాలంలో కూడా జగన్ పథకాలను అమలు చేసిన తీరుపై ప్రశంశలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రజల్లో జగన్ పై సంతృప్తి వ్యక్తమవుతోన్నా సొంత పార్టీ నేతల్లోనే జగన్ పై వ్యతిరేకత వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ ఒకరు ఇసుక విషయంలో బహిరంగంగంగానే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక అవినీతి లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నారు. 
 
సీఎం జగన్ వాలంటీర్ల, సచివాలయ వ్యవస్థల ద్వారా పాలన సాగిస్తూ పార్టీ నేతలు అవినీతికి పాల్పడే అవకాశమే లేకుండా చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నేతల్లో తాము కోట్లు ఖర్చు చేసి అధికారంలోకి వచ్చామని.... తమకు సంపాదించుకునే అవకాశం ఉండటం లేదనే భావన వ్యక్తమవుతోందని ఒక వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎంపీ, ఎమ్మెల్యేలతో ప్రజలకు అవసరం లేకుండా పథకానికి అర్హులైతే గ్రామ, వార్డు సచివాలయాల ద్వారానే పథకాల అమలు జరుగుతోంది. 
 
ఇది కూడా వారిలో అసంతృప్తికి కారణమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు పలు చోట్ల అర్హులు కాని వారికి పథకాల అమలు జరిగేలా ప్రయత్నాలు చేస్తున్నా ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. కాంట్రాక్టులు కూడా నిబంధనల మేరకే దక్కుతున్నాయి. దీంతో కొందరు వైసీపీ నేతలు పార్టీపై, సీఎంపై బహిరంగంగా విమర్శలు చేస్తున్నరని ప్రచారం జరుగుతోంది. పార్టీలో కొందరు ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉండటంతో జగన్ వీరి విషయంలో ఎలా వ్యవహరిస్తాడో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: