ఏపీలో అధికార పార్టీ యేడాది పాల‌న పూర్తి చేసుకుంది. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సీఎం అయ్యి యేడాది అయ్యిందో లేదో ఇప్ప‌టి విర‌కు నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్న విబేధాలు కాస్త ముదిరి పాకాన ప‌డి రోడ్డు కెక్కుతున్నాయి. కొంద‌రు మంత్రులు ఎమ్మెల్యే ల మ‌ధ్య పొస‌గ‌ని ప‌రిస్థితి ఉంది. కొంద‌రు ఎమ్మెల్యేలు తోటి మంత్రులు, ఎంపీల‌పై విరుచుకు ప‌డుతున్నారు. మ‌రి కొంద‌రు ఎమ్మెల్యేలు త‌మ ప‌నులు కావ‌డం లేద‌నో లేదా అధికారులు త‌మ మాట విన‌డం లేద‌నో ఫైర్ అవుతున్నారు. ఈ లిస్టులో ఇప్ప‌టికే వినుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్ర‌హ్మ‌నాయుడు ఇటీవ‌ల ఫైర్ అయ్యారు. అధికారులు మాట విన‌డం లేద‌ని.. అసలు రీచ్‌ల్లో లోడ్ తో బ‌యలు దేరిన లారీలు ఎక్క‌డికి పోతున్నాయో తెలియ‌ద‌ని ఫైర్ అయ్యారు.

 

ఇక గురువారం నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే. మాజీ మంత్రి.. పార్టీ సీనియ‌ర్ నేత ఆనం వెంక‌ట రామ‌నారాయ‌ణ రెడ్డి అధికారుల తీరుపై ఫైర్ అయ్యారు. అస‌లు ఏపీలో 174 నియోజ‌క‌వ‌ర్గాలే ఉన్నాయ‌ని అనుకుంటున్నారా ?  వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం వారు పట్టించుకోరా ? అని ఆయ‌న భ‌గ్గుమ‌న్నారు. ఆయ‌న కోపం అంతా జ‌ల‌వ‌న‌రుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ పైనే ఉంద‌ని వైసీపీ వ‌ర్గాలు అంటున్నాయి. ఇక ఆయ‌న తాను సీనియ‌ర్ ను అయినా జ‌గ‌న్ త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కొద్ది రోజులుగా ఫైర్ అవుతున్నారు.

 

ఈ క్ర‌మంలోనే గ‌తంలో ఆయ‌న మాటలు పార్టీ లైన్ దాట‌గా జ‌గ‌న్ పిలిచి వార్నింగ్ ఇచ్చార‌న్న టాక్ వ‌చ్చింది. ఇక ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న బ‌ర‌స్ట్ అయ్యారు. మూడు రోజుల్లో పూర్తి వివ‌రాల‌తో తాను మీడియా ముందుకు వ‌స్తాన‌ని చెప్పారు. ఇక గురువార‌మే మ‌రో సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు సైతం అధికారులు మాట విన‌డం లేదంటూ ఫైర్ అయ్యారు. శానిటేష‌న్ వ‌ర్క్ ముంబై వాళ్ల‌కు ఎందుకు ఇచ్చార‌ని.. ఆయ‌న మంత్రి ఆళ్ల నాని స‌మ‌క్షంలోనే ఫైర్ అయ్యారు. ఇక ధ‌ర్మాన‌కు కూడా మంత్రి ప‌ద‌వి రాలేద‌న్న అస‌హ‌నం ఉంద‌ని అంటున్నారు. ఏదేమైనా వైసీపీలో సీనియ‌ర్ల అస‌మ్మ‌తి గ‌ళాలు అయితే పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: