ఒకప్పుడు బాల్యవివాహాలు ఎక్కువగా జరిగేవి కానీ ఈ మధ్య కాలంలో బాల్య వివాహాలు జరుగుతున్న సంఘటన మాత్రం ఎక్కడా కనిపించడం లేదు అన్న విషయం తెలిసిందే. ప్రజల్లో  రోజురోజుకి అవగాహన పెరిగి పోవడం బాల్య వివాహాలు చేసేందుకు  అంతగా ఆసక్తి చూపకపోవడం... తల్లిదండ్రులు కూడా తమ  పిల్లలకు సరైన వయస్సు వచ్చిన తర్వాతనే  పెళ్లి చేయాలనీ బావించటంతో  బాల్య వివాహాలు పూర్తిస్థాయిలో తగ్గిపోయాయి. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికీ అక్కడక్కడ బాల్య వివాహాలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఆధునిక సమాజంలో కూడా వివాహాలు జరుగుతూ ఉండడం సంచలనంగా మారింది. 

 


 తాజాగా ఇక్కడ జరిగిన బాల్య వివాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని అనుకుంది ఆ బాలిక కానీ ఆ బాలిక కోరికను ఆదిలోనే తుంచేశారు తల్లిదండ్రులు. ఏకంగా 6 వ తరగతిలోనే ఓ  అయ్యకి  ఇచ్చి పెళ్లి చేసి... సంచలనం సృష్టించారు. ఆరో తరగతి చదువుతున్న 12 ఏళ్ళ బాలికకు బాల్య వివాహం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి అధికారుల వద్దకు చేరడంతో అధికారులు తల్లిదండ్రులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది 

 


 మేడ్చల్ జిల్లాలోని ఓ ఆలయంలో జూన్ ఒకటో తేదీన జరిగిన బాల్య వివాహం ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. పదహారేళ్ల అమ్మాయి ని 23ఏళ్ల యువకుడు పెళ్లి చేసుకున్నాడు. ఇక ఈ బాల్య వివాహం పై బాలల హక్కుల సంఘం ఫిర్యాదుతో వరుడు అతని కుటుంబ సభ్యులు పురోహితులు పై కేసు నమోదు చేశారు పోలీసులు వారిని అరెస్ట్ చేసారు.  అయితే ఆ అమ్మాయికి కేవలం 12 సంవత్సరాల వయసు మాత్రమే ఉందని... ఆ మైనర్ బాలిక ఆరో తరగతి చదువుతుంది అంటూ బాలల హక్కుల సంఘం తెలిపింది. ఇక మరో విషయం ఏమిటంటే ఈ బాల్య  వివాహానికి హాజరైన వారు ఎవ్వరు కూడా  కరోనా  వైరస్ నిబంధనలను  పాటించలేదు అని తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: