ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా వైరస్ మాటలే వినిపిస్తున్నాయి. చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ భయంకరమైన వైరస్ ప్రపంచం మొత్తం వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 65 లక్షల 67 వేల 404 మంది కరోనా వైరస్‌ పాజిటివ్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 30 లక్షల 10 వేల 562. వ్యాధి నుంచి 31 లక్షల 68 వేల మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల 87 వేల 913 మంది చనిపోయారు.  ప్రపంచంలో మూడో వంతు మరణాలు, కేసులు ఒక్క అమెరికాలోనే సంబవించాయి. ఇక ఈ కరోనా మాత్రమే కాదు.. ప్రకృతి విపత్తులు కూడా మనుషులకు నిద్రపట్టకుండా చేస్తున్నాయి. ఇక జూన్‌ 3న ఉత్తర నార్వేలో ఒక విషాద సంఘటన చోటు చేసుకున్నది.

 

ఎన్నో ఇళ్లను  సముద్రం తనలోకి అమాంతం లాగేసుకుంది. ఈ సంఘటన కెమెరాలో రికార్డ్‌ అయింది. ఈ వీడియోను అల్టా నివాసి అయిన  జాన్ ఫ్రెడ్రిక్ డ్రాబ్లోస్ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతున్నది. ‘కొండచరియలు, భారీ బురదజల్లు అనేక ఇళ్లను సముద్రంలోకి లాగుతున్నాయి’ అనే క్యాప్షన్‌ జోడించాడు. సాధారణంగా సినిమాల్లో చూస్తున్నట్లు గ్రాఫిక్స్ తో ఒక్కసారే సముద్రం వచ్చి అన్నీ ఇళ్లు కొట్టుకోపోవడం ఈ దృష్యాలు కనిపించాయి.

 

రెండు నిమిషాలకు పైగా నడిచే ఈ వీడియోలో మొదట్లో వాతావరణం అంతా కూల్‌గా, ప్రశాంతంగా కనిపిస్తుంది. ఆ తర్వాత బాగా గమనించినట్లుయితే ఇళ్లన్నీ కదులుతున్నట్లుగా అనిపిస్తుంది.  ఆ తర్వాత మెల్లి మెల్లిగా ఇళ్లన్నీ సముద్రంలో కలిసి పోతున్నాయి.. ఈ దృష్యాలు చూస్తుంటే గుండె ఝల్లుమంటుంది.  వామ్మో సముద్ర తీరంలో ఇళ్లు కట్టుకుంటే ఇంత దారుణంగా ఉంటుందా అనిపిస్తుంది.  సిసి ఫుటేజ్‌లో బయట పడ్డ ఈ వీడియోను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. కొంతమంది 2020 ఏడాది కలిసిరాలేదు. ఎక్కడ చూసినా కష్టాలే అని కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: