పిల్లజల్లను  వదిలి.. ఇంటి మనుషులకు దూరంగా.. తెలియని ప్రపంచంలోకి.. సరి కొత్త జీవితాన్ని ప్రారంభించి.. జీవిత పోరాటం చేస్తూ.. ఎక్కడో ఉన్న మన వాళ్ళని చూసుకుంటూనే మనం కూడా జాగ్రత్తగా ఉంటూ.. కష్టాలు పడుతూనే..పైసా పైసా  వేసుకుంటూ.. రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లి  ప్రాంతంకానీ  ప్రాంతంలో... ముక్కు ముఖం తెలియని మనుషుల మధ్య కేవలం ఉపాధికోసం బతుకుతారు వలస కూలీలు. అలాంటి వలసకూలీ లకు ఇప్పుడు వచ్చిన కష్టం మాటల్లో వివరించలేనిది . బతుకు జీవుడా అంటూ.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని.. బిక్కు  బిక్కుమంటూ  బతకాల్సిన పరిస్థితి. సొంత రాష్ట్రం వెళ్లలేక ఇక్కడ ఉండలేక బతుకు భారమై ఇల్లు దూరమై.. ఏమి చేయలేని దీనస్థితి లో ఉన్న వలస కార్మికులు  ఎవ్వరు  ఆదుకుంటారో  అని దీనంగా చూశారు. 

 

 కరోనా వైరస్ వలస కార్మికుల జీవితాలను అల్లకల్లోలం చేసింది. బతుకుదెరువు కోసం కుటుంబ పోషణ కోసం రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ కష్టపడి పైసా పైసా కూడబెట్టి... కంటికి దూరంగా మనసుకు దగ్గరగా ఉన్న మనవాళ్ళ జీవనోపాధికోసం పంపించడం ఇదే వలస కార్మికులు జీవితం. కానీ కరోనా  వైరస్ వచ్చి వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. ఈ నేపథ్యంలో వలస కూలీలు అందరూ లాక్ డౌన్ సడలింపు ఇవ్వగానే  ఎంతో మంది రైళ్లపై  ఆధారపడకుండా ఏకంగా వందల కిలోమీటర్లు నడిచి స్వస్థలాలకు వెళ్లారు.. ఇళ్ల స్థలాల కు వెళ్ళేందుకు బయలుదేరిన ఎంతో మంది కార్మికులు ప్రాణాలను సైతంకోల్పోయారు . ఇలా వలస కార్మికుల కష్టాలను కళ్లకు కట్టేలా ఎన్నో చిత్రాలు హృదయం ద్రవింప  చేసిన విషయం తెలిసిందే. 

 


 ఇలాంటి కష్టకాలంలో ఒక్కడొచ్చాడు.. అతన్ని అందరూ విలన్ అంటుంటారు.. కానీ వలస కార్మికులు జీవితాలకు అతను ఒక హీరోగా కాదు కాదు  దేవుని గా మారిపోయాడు. ఎంతో మంది సినీ ప్రముఖులు ఉన్నప్పటికీ సోను సూద్ పరస కార్మికుల కోసం చేస్తున్న సాయం  మాటలతో వెలకట్టలేనిది. వలస కార్మికుల కష్టాలను చూసి చలించిపోయిన సోనూసూద్ మొదటినుంచి... వలస కార్మికుల కష్టాలు తీర్చేందుకు ఎంతో పెద్ద మనసు చాటుకుంటున్నారు. రైళ్లు బస్సులు విమానాలు ఇలా ఒక్కటేమిటి.. వలస కార్మికులు స్వగ్రామాలకు చేరేందుకు స్థాయికి మించిన సహాయాన్ని చేస్తున్నారు సోను సూద్. సోను సూద్ వలస కార్మికులు అందరికీ దేవుడు గా మారిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: