జగన్ మాట్లాడకుండా ఉన్నంతసేపే ఎవరైనా.  ఆయన కనుక తలచుకుంటే భూకంపాలే వస్తాయి. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత మిష్టర్ కూల్ గా మారిపోయారు. . అందుకే అలా జరుగుతోందని అంటున్నారు. జగన్ ఇదివరకు మాదిరిగా ఉంటే కనుక నేతల తీరు ఇలా ఉండదని కూడా పార్టీలో చర్చ సాగుతోంది.

 

జగన్ తాను ప్రజలందరికీ ఇచ్చిన మాట ప్రకారం హామీలను వరసగా నెరవేరుస్తున్నారు. అందుకోసం ఆయన తన కాలాన్ని మొత్తం ఖర్చు చేస్తున్నారు. నిధుల లేమితో ఏపీ ఒక వైపు ఉంది. విపక్షం అంతా కట్టకట్టుకుని రాజకీయ  దాడులు చేస్తోంది. మీడియా ఎపుడూ వైసీపీకి, జగన్ కి పూర్తి  వ్యతిరేకంగా ఉంది. ఇక అన్ని విధాలుగా ఇబ్బందులు ఉన్నా  సరే జగన్ మాట ప్రకారం అన్ని రకాల సంక్షేమ పధకాలు నెరవేరుస్తున్నారు.

 

కరోనా మహమ్మారి ఓ వైపు ఉన్నా కూడా ఈ రోజు వైఎస్సార్ వాహన‌ మిత్ర పేరిట ఆటో, కార్ డ్రైవర్లందరికీ తలా పదివేల రూపాయలు వారి ఖాతాల్లో వేసి జగన్ శభాష్ అనిపించుకున్నారు. ఇక ఇచ్చిన హామీల్లో తొంబై శాతం నెరరేర్చి జగన్ గ్రేట్ అనిపించుకుంటున్నారు.

 

అయితే జగన్ ఓ వైపు కష్టపడుతూంటే పార్టీలో కొంతమంది కాంగ్రెస్ కల్చర్ ని తీసుకువస్తున్నారు. అసమ్మతి గళాలు వినిపిస్తున్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని బజారుకు ఈడుస్తున్నారు. మరి వారికి జగన్ సంగతి తెలియనిది అనుకోలేం.  ఆయనకు ఉన్న జనాదరణ, ఆయన ఏపీలో రాజకీయంగా ఎంతటి బలవంతుడో కూడా తెలియదు అనుకోలేం. అయినా కూడా వారు ఇలా రెచ్చిపోతున్నారంటే జగన్ వీటిని చూస్తూ ఉపేక్షించడమే. 

 

ఇక సమయం ఇవ్వకుండా పార్టీపైన కూడా జగన్ ద్రుష్టి పెట్టాలని అంతా కోరుతున్నారు. పార్టీని గాడిలో పెట్టకుంటే ఇలాంటి నిరసన గళాలే రేపటి రోజున మరింతగా ఆందోళనలకు, అలజడులకు కారణమవుతారని కూడా అంటున్నారు మరి జగన్ మూడవ కన్ను తెరవాల్సిన సమయం ఆసన్నమైందా. చూడాల్సిందే.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: