కరోనా నేపథ్యంలో చంద్రబాబు గత రెండు నెలలపై నుంచి హైదరబాద్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే.  లాక్ డౌన్ వల్ల ఆయనకు ఏపీకి రావడానికి కుదరలేదు. దీంతో హైదరబాద్ లోనే ఉంటూ...జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వచ్చారు. అయితే విశాఖ గ్యాస్ లీకేజ్ ఘటన జరిగినప్పుడు, ఏపీకి వెళ్ళేందుకు పర్మిషన్ ఇవ్వాలని బాబు...కేంద్రానికి లేఖ రాశారు. ఇక అప్పుడు ఏం జరిగిందో తెలియదుగానీ, బాబుకు పర్మిషన్ రాలేదు.

 

ఆ వ్యవహారం అలా సద్దుమణిగాక, లాక్ డౌన్ లో ఇంకా సడలింపులు వచ్చిన సమయంలో బాబు మళ్ళీ ఏపీకి వెళ్ళేందుకు పర్మిషన్ కావాలని, తెలంగాణ డి‌జి‌పి, ఏపీ డి‌జి‌పిలకు లేఖలు రాశారు. అయితే తెలంగాణ డి‌జి‌పి వెంటనే పర్మిషన్ ఇవ్వగా, ఏపీ నుంచి ఒకరోజు తర్వాత పర్మిషన్ వచ్చింది. ఇక బాబు విశాఖకు బయలుదేరి వెళ్లాల్సిన రోజు విమానాలు రద్దు అయ్యాయి.

 

దీంతో బాబు రోడ్డు మార్గాన అమరావతికి వెళ్లారు. కానీ తర్వాత విశాఖ మాత్రం వెళ్లలేదు. మహానాడు కార్యక్రమాన్ని రెండు రోజుల పాటు జూమ్ యాప్ లో నిర్వహించి, తర్వాత హైదరబాద్ వెళ్ళిపోయారు. కనీసం విశాఖ ఊసు ఎత్తకుండా మళ్ళీ అటు వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే బాబుకు ఏపీ ప్రజల కోసం రాలేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. మహానాడు కోసమే చంద్రబాబు ఏపీకి వచ్చారే తప్ప.. ప్రజల కోసం కాదని మంత్రి బాలినేని లాంటి వారు మాట్లాడుతున్నారు.

 

అటు వైసీపీ శ్రేణులైతే బాబుపై సెటైర్లు వేస్తున్నారు. బాబుకు ఏపీ ప్రజలు అక్కరలేదు అనుకుంటా, తెలంగాణలో చచ్చిపోయిన పార్టీని బ్రతికించి నడుపుకుంటారనుకుంటా అని జోకులు పేలుస్తున్నారు. అయిన బాబుకు ఏపీలో స్పేస్ లేదని, జనం అంతా జగన్ వైపు ఉన్నారని అర్ధమయ్యి, బాబు మళ్ళీ హైదరబాద్‌కు వెళ్లిపోయారని ఎద్దేవా చేస్తున్నారు. ఏదేమైనా బాబు మహానాడు కోసమే ఏపీకి వచ్చారని మాత్రం బాగా అర్ధమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: