టీడీపీ ఫైర్ బ్రాండ్ నాయకుల్లో యరపతినేని శ్రీనివాసరావు కూడా ఒకరు. గుంటూరు జిల్లా గురజాలకు చెందిన ఈయన మొదట నుంచి టీడీపీలో ఉంటూ, మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో జగన్ గాలి ముందు తట్టుకోలేక mahesh REDDY' target='_blank' title='కాసు మహేష్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కాసు మహేష్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఓడిపోయాక కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న యరపతినేని, మళ్ళీ పోలిటికల్ స్క్రీన్‌పైకి వచ్చి జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ఉంటున్నారు.

 

అడపాదడపా మీడియా సమావేశాలు పెడుతూ..కాసు మహేష్ రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తారు. తాజాగా కూడా కాసు మహేష్ అనుచరులు గురజాలని నాశనం చేశారని, భూ కబ్జాలు, అత్యాచారాలు, బ్లీచింగ్ పౌడర్ లో సున్నం కలిపి అమ్మేస్తున్నారంటూ విమర్శలు చేశారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడంతో కాస్త పరుష పదజాలం వాడుతూనే మాట్లాడుతున్నారు.

 

తాజాగా కూడా జగన్‌ని ఉద్దేశించి కాస్త ఘాటుగా విమర్శలు చేశారు. చంద్రబాబు, లోకేష్‌ మీద నోరు పారేసుకుంటే ఉతికి ఆరేస్తామని, ప్రజావ్యతిరేక విధానాలతో సీఎం జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. శశికళ మాదిరిగా సీఎం జగన్‌ జైలుకెళ్తే వైసీపీ కుక్కలు చింపిన విస్తరేనని చెప్పారు. అయితే ఈయన కాస్త హద్దు దాటే విమర్శలు చేయడంతో వైసీపీ శ్రేణులు కూడా, స్ట్రాంగ్ గానే విమర్శలు చేస్తున్నారు.

 

చంద్రబాబు, లోకేష్‌లతో పాటు యరపతినేనిని కూడా జనం ఉతికి ఆరేశారని, అందుకే ఆ ఫ్రస్టేషన్‌లో ఏదో ఏదో మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. శశికలతో పొలుస్తూ జగన్ జైలుకు వెళ్లతారని మాట్లాడుతూ, మరీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడుతున్నారు. శశికళ ఎందుకు జైలుకు వెళ్లారో అందరికీ తెలుసని, ఇక జగన్ ని అన్యాయంగా ఇరికించి జైలుకు పంపారని సంగతి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసని, చంద్రబాబులాగా స్టేలు తెచ్చుకోలేదని, ధైర్యంగా విచారణ ఎదురుకుంటున్నారని అంటున్నారు. ఇక గత ఐదేళ్లు చేసిన అక్రమాల ఒక్కొకటిగా బయటపడుతున్నాయని, కాబట్టి జైలుకు వెళ్ళేది ఎవరో త్వరలో తెలిసిపోతుందని యరపతినేనిపై ఫైర్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: