వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామ పంచాయితీలని సచివాలయాలుగా మార్చి వాటికి ఆ పార్టీ రంగులు వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ రంగులు వేసే కార్యక్రమం కేవలం సచివాలయాలకే పరిమితం కాలేదు. వాటర్ ట్యాంక్‌లు, స్కూల్స్, కరెంట్ స్తంభాలు, రోడ్ల డివైడర్లు ఇలా కుదిరిన చోటల్లా వైసీపీ రంగు పడింది. అయితే దీనిపై ప్రతిపక్ష టీడీపీతో సహ మిగిలిన పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

 

వెంటనే రంగులు తొలగించాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం మీద విమర్శలు చేశాయి. అయినా సరే జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఈ క్రమంలోనే దీనిపై టీడీపీకి చెందిన వారు హైకోర్టుకు వెళ్ళగా, అక్కడ జగన్ ప్రభుత్వానికి షాక్ తగిలింది. రంగులు తీయాలని కోర్టు ఆదేశాలు జారీ చేశారు. అయినా సరే జగన్ ప్రభుత్వం తీయలేదు. దీనికి కౌంటర్ అఫడవిట్ దాఖలు చేసి, రంగులు ఉంచేలా చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించింది.

 

ఎంత చేసినా కోర్టు అదే తీర్పు చెప్పింది. దీంతో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ప్రభుత్వం.. సుప్రీంకోర్టులో సైతం ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ఏపీలో గ్రామ పంచాయితీ కార్యాలయాల రంగుల వ్యవహారంపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. నాలుగు వారాల్లో రంగులు తొలగించాలని ఆదేశించింది.. నాలుగు వారాల్లో వేసిన రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కారణగా పరిగణించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు పేర్కొంది.

 

దీంతో రంగులు తీయాలసిన పరిస్తితి వచ్చింది. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు టీడీపీపై రివర్స్ ఎటాక్ చేయడం మొదలుపెట్టారు. టీడీపీని కూడా ప్రజల్లో బుక్ చేయాలనే ఉద్దేశంతో, గతంలో టీడీపీ ప్రభుత్వం అన్ని కార్యాలయాలకు పసుపు రంగు వేసిందని, అప్పుడు రంగులపై ఏం చెప్పని బాబు.. ఇప్పడు అస్తమాను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం కావట్లేదని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. అయితే దీనికి తెలుగు తమ్ముళ్ళు కూడా స్పందిస్తూ...గతంలో ఒక్క ప్రభుత్వ కార్యాలయానికి కూడా టీడీపీ రంగు వేయలేదని, కేవలం అన్నా క్యాంటీన్లకు వేశారని, అలాగే పార్టీకి సంబంధించినవి ఏమన్నా ఉంటే వాటికే వేశారని, వైసీపీ నేతలు కావాలనే అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: