తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం ఏ మాత్రం తగ్గటం లేదు. దేశంలో కరోనా వైరస్ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి రాష్ట్రాలలో తమిళనాడు కూడా ఒకటి. రోజురోజుకీ కరోనా వైరస్ తీవ్రత తమిళనాడు రాష్ట్రంలో పెరుగుతూనే ఉంది. కరోనా వైరస్ కట్టడి చేయడంలో తమిళనాడు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నా పరిస్థితి కంట్రోల్ లోకి వచ్చిన దాఖలాలు ఇప్పటివరకు కనబడలేదు. ఇటువంటి సమయంలో చెన్నై పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడా కూడా ప్రజలు గుంపులు గుంపులుగా తిరిగే ప్రసక్తి లేకుండా ప్రతిచోట పోలీసులు పహారా కాస్తున్నారు.

IHG

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజలకు స్వేచ్ఛ కలిగించిన ఇద్దరూ కలసి వెళ్తున్నా గాని ఊరుకోవడం లేదు. ముఖ్యంగా  బండి మీద ఒకరి కంటే ఎక్కువ మంది వెళ్తే మాత్రం ఇక ఊరుకోవద్దు అని నిర్ణయానికి వచ్చేసినట్టు తెలుస్తుంది. బైకులు, స్కూటర్లపై ఇద్దరు ప్రయాణిస్తే రూ.500 జరిమానా విధించాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఈ కొత్త ఉత్తర్వులు అమలులోకి తక్షణమే అమలులోకి వచ్చినట్టు చెన్నై ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

IHG

తమిళనాడు రాష్ట్రంలో ఎక్కువగా కరోనా వైరస్ ప్రభావం చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో ఉంది. కాగా ఫైన్ ల విషయంలో ప్రజల నుండి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పనులు ఉండాల్సిన టైములో అత్యవసరంగా వెళుతున్న టైములో చాలామంది పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఏది ఏమైనా తమిళనాడు రాష్ట్రంలో పోలీసులు బైక్ పై ఇద్దరు వెళ్తుంటే భారీగా ఫైన్ లు వేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: