ప్రస్తుతం విద్యుత్ కార్మికులకు  తెలుగు రాష్ట్రాల్లో కష్టాలు వచ్చాయ అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినిపిస్తుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎంతో మంది విద్యుత్ ఉద్యోగుల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు చేస్తున్న వారు ఉన్నారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంతో మంది తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. గతంలో వీరు  తమ తమ రాష్ట్రానికి అనుగుణంగా ఉద్యమాలు చేసిన వాళ్లు. రాష్ట్ర విభజన జరిగిన సందర్భంలో ఇరు రాష్ట్రాలకు చెందిన విద్యుత్ కార్మికులను  ఎలాంటి కష్టం లేకుండా చూసుకుంటామని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హామీ ఇచ్చారు. 

 

అయితే రాష్ట్ర విభజన జరిగినప్పటికీ ఇప్పటికీ తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రాలో ఆంధ్ర ఉద్యోగులు తెలంగాణ లో పని చేస్తున్నా వారు  చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన విద్యుత్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోం అంటూ తెలంగాణ విద్యుత్ శాఖ ప్రకటించింది. దీనిపై కోర్టుకు వెళితే  వారిని ఉద్యోగం లోకి తీసుకోవాలని జీతాలు చెల్లించాలని సూచించింది. కోర్టు  సూచించినప్పటికీ జీతాలు ఇవ్వలేదు తెలంగాణ విద్యుత్ శాఖ  దీంతో జీతాలు లేక కొన్ని రోజుల వరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక తాజాగా ధర్మాధికారి కమిటీ నియామకం అయ్యి  విద్యుత్ ఉద్యోగుల ఇబ్బందులను తాము  సరి చేస్తామని తెలిపారు.

 


 అసలు విద్యుత్ ఉద్యోగుల బాధ ఏమిటి అంటే.. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ ఉద్యోగుల ఉద్యోగం తీసేయ్యగా... అక్కడ విద్యుత్ ఉద్యోగులను తీసుకోవడం లేదు కారణం తెలంగాణాలో ఆంధ్ర ఉద్యోగులు   అక్కడికి వస్తే... ఆంధ్ర లో పనిచేస్తున్న వారి ఉద్యోగాలు ఎక్కడ పోతాయోనని  అక్కడికి కూడా రానివ్వటం లేదు . దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు ప్రస్తుతం ఇటు  తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఉద్యోగం చేసుకోలేక పోతున్నారు . విద్యుత్ ఉద్యోగులు చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తున్నారు. చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లిన ధర్మాధికారి కమిటీ దగ్గరికి వెళ్లాలంటూ  తీర్పునిచ్చింది అత్యున్నత ధర్మాసనం. దీంతో విద్యుత్ కార్మికులు ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: