తెలంగాణ లో గత కొద్దీ రోజుల నుండి కరోనా కేసుల తోపాటు మరణించే వారి సంఖ్య కూడా ఎక్కువతుంది. దీనికి కారణం సడలింపులు ఇవ్వడమే.. ఇంతకుముందు కేవలం ఒక్క జిహెచ్ఎంసి లో  మాత్రమే కేసులు నమోదయ్యేవి కానీ ఇప్పుడు మిగితా జిల్లాలకు కూడా వైరస్ విస్తరించడం ఆందోళన కలిగిస్తుంది.
 
ఇక నిన్న ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 127 కరోనా కేసులు నమోదు కాగా ఆరుగురు మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈకొత్త కేసులతో కలిపి ఇప్పటివరకురాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2688కు చేరింది అందులో1587మంది బాధితులు కోలుకోగా ప్రస్తుతం1455కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు కరోనా వల్ల 105మంది చనిపోయారు. 
ఇక దేశ వ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజే దేశం లో 10000కేసులు బయటపడ్డాయి. సింగిల్ డే లో ఇప్పటివరకు ఇదే రికార్డు. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 2933, తమిళనాడులో 1384, ఢిల్లీ లో 1359, గుజరాత్ లో 492 కేసులు నమోదయ్యాయి. కాగా దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 226000 దాటగా 6400కు పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. మరోవైపు జూన్ 8నుండి హోటళ్లు ,రెస్టారెంట్లు కూడా తెరుచుకోనున్నాయి. దాంతో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం వుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: