ఇప్పటికే ఏపీలో జగన్ సర్కారు అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపొందిస్తోంది. ప్రత్యేకించి పాఠశాలల విషయంలో జగన్ ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల దశ దిశ మార్చేందుకు ఆయన కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తోంది. అందుకు అమ్మ ఒడి కార్యక్రమమే ఓ ఉదాహరణ. వేల కోట్ల రూపాయలు వెచ్చించి మరీ.. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేయాలని నిర్ణయించారు.

 

 

ఆ మార్పు ప్రతి ఒక్కరూ గుర్తించేలా.. నాడు- నేడు అంటూ ఫోటోలు తీసి ప్రదర్శించాలని నిర్ణయించారు. ఇదంతా పాత విషయమే. ఇక ఇప్పుడు జగన్ తీసుకున్న తాజా సంచలన నిర్ణయం ఏంటంటే.. కేవలం పాఠశాలలే కాదు.. అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ‘నాడు – నేడు’ కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.

 

 

స్త్రీ, శిశు సంక్షేమ శాఖపై సీఎం వైయస్‌ జగన్‌ నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రీ ప్రైమరీ స్కూల్స్‌ తరహాలో అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలని సీఎం జగన్ ఆదేశించారు. అంగన్‌ వాడీల్లో ఫర్నిచర్, ఫ్యాన్లు, లైట్లు, పరిశుభ్రమైన తాగునీరు సహా అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని జగన్ ఆదేశించారు. సుమారు 24 వేల అంగన్‌వాడీ భవనాల్లో చేపట్టాల్సిన పనులు, సదుపాయాలపై అంచనాలు రూపొందించాలని సీఎం ఆదేశించారు.

 

 

అంతే కాదు.. 31 వేల అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకు కూడా అంచనాలను రూపొందించాలని జగన్ సూచించారు. పిల్లలు, తల్లులకు ఇచ్చే పౌష్టికాహారం నాణ్యంగా ఉండాలని, పౌష్టికాహారంలో నాణ్యత పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, సీఎస్‌ నీలం సాహ్ని, పంచాయతీ రాజ్‌ స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, దిశ ప్రత్యేక అధికారిణి కృతికాశుక్లా, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: