భారత్ చైనా వివాదం రోజురోజుకు ముదురుతోంది. సరిహద్దులో పెద్ద ఎత్తున చైనా సైన్యాన్ని మోహరిస్తూ ఉండటంతో భారత్ పక్కా ప్రణాళికలతో చైనాను ఎదుర్కొనే దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు నాలుగు భారీ షాకులు ఇచ్చారు. భారత్ షాకుల దెబ్బకు చైనా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఇప్పటివరకు కయ్యానికి కాలు దువ్విన చైనా ప్రస్తుతం చర్చల దిశగా సమస్య పరిష్కారం వైపు అడుగులు వేస్తూ ఉండటం గమనార్హం. 
 
ప్రధాని మోదీ భారత్ చైనా వివాదం గురించి ట్రంప్ తో చర్చిస్తూ మొదటి షాక్ ఇచ్చారు. ఇప్పటికే కరోనా వైరస్ విజృంభణ వల్ల చైనాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమెరికా సరిహద్దు వివాదంలో కూడా చైనాపై విమర్శలు చేస్తోంది. ఈ వివాదాన్ని ట్రంప్ పరిష్కరిస్తానని చెప్పడంతో చైనా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అమెరికా ఈ వివాదంలో తలదూరిస్తే సమస్య మరింత పెద్దదయ్యే అవకాశం ఉందని చైనా భావించింది. 
 
గత నెలలోని డెమ్ చాక్, గాల్వన్ వాలీ ప్రాంతాల్లో చైనా బలగాలు చొచ్చుకుని రావడంతో భారత్ బలగాలు రంగంలోకి దిగి యుద్ధ వాతావరణం నెలకొనేలా చేశాయి. ప్రధాని మోదీ చర్చల ద్వారా సమస్య పరిష్కారం కాకపోతే యుద్ధానికైనా సిద్ధం అనేలా చైనాకు ధీటుగా సైన్యాన్ని మోహరించి చైనాకు రెండో షాక్ ఇచ్చారు. చైనా ఆర్మీ హెచ్చరించినా భారత్ సైన్యం రాకపోకల కోసం... రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఏర్పాట్లు యథాతథంగా జరుగుతున్నాయి. 
 
భారత్ ఎట్టి పరిస్థితుల్లోను నిర్మాణాలను కొనసాగిస్తామని చెప్పడం చైనాకు మరో షాక్ అనే చెప్పాలి. ప్రధాని మోదీ చైనా పరిస్థితులపై స్వయంగా సమీక్ష నిర్వహించారు. ఆర్మీ ఉన్నాతాధికారులతో చర్చలు జరిపారు. స్వయంగా మోదీ రంగంలోకి దిగడంతో భారత్ సరిహద్దు వివాదం విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గదని చైనాకు అర్థమైంది. దీంతో చైనా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవడానికి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: