తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం తీసుకు రావాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందడం ఆయన ఇప్పటికీ దిగమింగుకోలేకపోతున్నారు. పార్టీ ఓటమి చెందడంతో చాలామంది నాయకులు పార్టీకి దూరంగా ఉంటూ, అంటీ ముట్టనట్టు గా వ్యవహరిస్తున్నారు అనే విషయాన్ని చంద్రబాబు గ్రహించారు. ప్రభుత్వంపై ఆందోళనలు, ఉద్యమాలు చేసే విషయంలో పార్టీ శ్రేణులు పెద్దగా ఆసక్తి చూపించకపోవడం వంటివి చంద్రబాబు దృష్టికి వెళుతున్నాయి. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెనుకడుగు వేస్తున్నారనే విషయాన్ని బాబు గుర్తించారు. దీనికి కారణం గత టిడిపి ప్రభుత్వంలో కాంట్రాక్టు పనులు వారు చేపట్టడం, ఆ తరువాత ఎన్నికలు రావడం ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓటమి చెండమే.

IHG


 కొత్తగా వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ మొత్తం బిల్లు అన్నింటిని నిలిపివేయడంతో ఆర్థికంగా టిడిపి ద్వితీయ శ్రేణి నాయకులు  చితికిపోయారు. మళ్ళీ వారు టిడిపిలో యాక్టివ్ కావాలంటే వారికి ఆ పెండింగ్ బిల్లులు చెల్లింపులు జరగడం ఒక్కటే మార్గం అనేది చంద్రబాబు కి బాగా తెలుసు. అందుకే ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యక్రమం మొదలు పెట్టారు. అలాగే ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపైన కేంద్రానికి ఫిర్యాదు చేస్తూ, పెండింగ్ బిల్లులు విడుదలయ్యేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ శ్రేణులు చేపట్టిన కాంట్రాక్టు బిల్లలు సుమారు రెండు వేల కోట్ల వరకు ఆగిపోయినట్లు తెలుస్తోంది. 


ఆ నిధులు విడుదల అయితే కానీ, తెలుగు తమ్ముళ్ళు మళ్ళీ ఉత్సాహంగా ముందుకు  కదలరని, ఏదో రకంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి పెండింగ్ బిల్లులను క్లియర్ చేయించాలని, తద్వారా మళ్ళీ ఆ టీడీపీ నాయకులంతా ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. మరి చంద్రబాబు ఎత్తుగడలు తెలిసిన వైసీపీ ఈ విషయంలో సానుకూలంగా ఉండే ఛాన్స్ లేదు. ఎందుకంటే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాంట్రాక్టుల పేరుతో తెలుగు తమ్ముళ్లకు ఆర్థికంగా మేలు చేసే ఉద్దేశంతో హడావుడిగా ఎన్నికల ముందు ఈ కాంట్రాక్టులు ఇచ్చారని , ఎంతో అవినీతి జరిగింది అనేది జగన్ పదే పదే ప్రస్తావించేవారు. మరి ఇప్పుడు ఆ విషయంలో సానుకూలంగా ఉండే ఛాన్స్ ఉండకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: