రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఇప్పుడు జల వివాదం అనేది తీవ్ర స్థాయిలో జరుగుతుంది. జలవనరుల శాఖలో అధికారులు ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు పరోక్షంగా కూడా చేసుకునే పరిస్థితి వచ్చింది. కృష్ణా యాజమాన్య బోర్డ్ మీటింగ్  గురువారం జరిగింది. ఈ మీటింగ్ లో రెండు రాష్ట్రాలకు చెందిన జలవనరుల శాఖలకు చెందిన అధికారులు కీలకంగా పాల్గొన్నారు. నీటి కేటాయింపులు సహా అనేక విషయాలు చర్చకు వచ్చాయి. 

 

అంత వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినపడుతున్నాయి. రెండు రాష్ట్రాల‌కు చెందిన పాలకులు బాగానే ఉన్నారు గాని ఇప్పుడు అధికారులు విమర్శలు చేసుకుంటున్నారు. వాస్తవానికి రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలి అనేది జగన్ టార్గెట్. ముందు ఆయన సిఎం కేసీఆర్ తో కూర్చుని దీని గురించి మాట్లాడుకుని జీవో జారీ చేసి ఉంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదని అంటున్నారు. ఎప్పుడు అయితే పోతిరెడ్డిపాడు విష‌యంలో జ‌గ‌న్ జీవో జారీ చేశారో అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌శాంతంగా ఉన్న ఏపీ, తెలంగాణ ల ప్ర‌భుత్వాల మ‌ధ్య వాతావ‌ర‌ణం కాస్త వేడెక్కింది.

 

వాస్తవానికి జగన్ తీసుకున్న నిర్ణయంలో తప్పేమీ లేకపోయినా అది తెలంగాణా పూర్తి స్థాయిలో అర్ధం చేసుకోలేదు. అధికారులు ఏ స్థాయిలో వాదనలను కృష్ణా బోర్డ్ ముందు వినిపించినా మీడియాలో కింద రెండు ముక్కలు రావడమే గాని వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉండద‌ని గ‌త కొద్ది రోజుల ప‌రిణామాలు చెపుతున్నాయి. జగన్ కేసీఆర్ కలిపి ఒక మీడియా సమావేశం దీని మీద ఏర్పాటు చేసి ఉంటే బాగుంటుంది అని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: