డాక్టర్ సుధాకర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. డాక్టర్ సుధాకర్ పై సీబీఐ కేసు నమోదు చేయడంతో ఈ కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. తన కుమారుడిని తక్షణం కోర్టులో ప్రవేశపెట్టాలంటూ సుధాకర్ తల్లి కావేరి బాయి హెబియర్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. అక్రమంగా తన కుమారుడిని నిర్భంధించారని ఆమె ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ లో జ్యూడిషియల్ లేదా పోలీస్ కస్టడీకి అనుమతి లేదని... సుధాకర్ ను అక్రమంగా నిర్భంధించి మానసిక వైద్యశాలలో పెట్టారని ఆమె అన్నారు. 
 
తన బిడ్డ స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిందని.... అక్రమంగా నిర్భంధించటానికి లీగల్ అథారిటీ లేదని ఆమె పేర్కొన్నారు. ఈ పిటిషన్ ఈరోజు విచారణకు రానుంది. హెడ్ కానిస్టేబుల్ వెంకటరమణ ఫిర్యాదు ఆధారంగా సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని... నడిరోడ్డుపై ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడని సుధాకర్ పై సీబీఐ కేసులు నమోదు చేసింది. 
 
ఈ కేసుకు సంబంధించిన ఎఫ్.ఐ.ఆర్. కాపీని సీబీఐ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. డాక్టర్ సుధాకర్ ద్వారా వైసీపీని ఇబ్బందులు పెట్టాలని భావించిన చంద్రబాబుకు ఇప్పుడు వరుస షాకులు తగులుతున్నాయి. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించడంతో సంబరాలు చేసుకున్న టీడీపీ సుధాకర్ కులాన్ని అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో రాజకీయాలు చేసింది. కానీ ఊహించని విధంగా సీబీఐ సుధాకర్ పై కేసులు నమోదు చేయడంతో టీడీపీ డిఫెన్స్ లో పడింది. 
 
డాక్టర్ హోదాలో ఉండి నిబంధనలను ఉల్లంఘించడం.... ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అధికారంలో ఉన్న సర్కార్ పెద్దలపై విమర్శలు చేయడం కూడా ధిక్కారమేనని భావించి సీబీఐ కేసులు నమోదు చేసింది. సుధాకర్ పై కేసు నమోదు చేయడంతో ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు ఇరకాటంలో పడ్డారు. నిన్నటివరకు సుధాకర్ పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు చేసిన చంద్రబాబు, లోకేశ్ సీబీఐ కేసు అనంతరం సైలెంట్ అయ్యారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: