ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ బలపడకపోతే మాత్రం ఇప్పుడు ఆ పార్టీ దాదాపుగా నాశనం అయ్యే సూచనలే ఎక్కువగా ఉంటాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ పార్టీ  మాత్రం ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో మార్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉన్నా సరే ఆ దిశ‌గా చేస్తోన్న ప్ర‌య‌త్నం ఎంత మాత్రం లేదు అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దానికి కారణం ఏంటీ అనేది తెలియదు గాని... పార్టీ 35 ఏళ్ల చ‌రిత్ర‌లోనే లేనంత ఘోర‌మైన స్థితిలో ఉన్నా కూడా క్షేత్ర స్థాయిలో కొందరు నాయకులు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.

 

చంద్రబాబు దృష్టికి సదరు సమస్యలు అన్నీ వెళ్ళినా సరే బాబు గారు మాత్రం ఏమీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు. పార్టీలో ప‌ట్టులేని.. ప్ర‌జ‌ల్లో గెల‌వ‌లేని కొందరికి అనవసరంగా పెత్తనం ఇవ్వడం చంద్రబాబు చేస్తున్న తప్పు అని సీనియర్లు ఇటీవల జరిగిన మహానాడు మీటింగ్ లో కూడా చెప్పినా సరే బాబోరిలో మార్పు మాత్రం పెద్దగా రాలేదు. దీనిపై మార్పు రాకపోతే మాత్రం క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

 

రాజకీయంగా ఇప్పుడు బలపడాలి అంటే కార్యకర్తలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. కాని ఇప్పుడు ఆ పార్టీలో అది కూడా ఎక్కడా జరగడం లేదు అనేది కొందరి మాట. చాలా మంది సీనియర్ నేతల్లో కూడా చంద్రబాబు వ్యవహారశైలి పై అసహనం ఉందని... అది మారకపోతే మాత్రం పార్టీ నాశనమే అంటున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం ఇప్ప‌ట‌కీ లోకేష్ చెప్పిన‌ట్టు చేయాల‌న్న ఆదేశాల‌తో బాబు ఇక మార‌ర‌ని తీవ్ర అస‌హ‌నంతో ర‌గిలి పోత‌న్నార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: