బాలయ్య చిరంజీవి మధ్య వాగ్వాదం మొదలైనప్పటి నుంచి వారికి సంబంధించిన ఏదో ఒక విషయం ప్రతి రోజూ వస్తూనే ఉంది. ముఖ్యంగా బాలయ్య చిరంజీవి వ్యవహారశైలిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ వస్తున్నారు. ఒకవైపు బాలయ్య వర్గం మరోవైపు చిరంజీవి వర్గం కామెంట్స్ చేసుకుంటూనే ఉన్నారు. మొన్నటి వరకు ఈ వివాదం జరుగుతూనే ఉన్నా, ఇప్పుడు కాస్త సైలెంట్ అయినట్టుగా కనిపిస్తున్నారు. అయితే నేరుగా చిరంజీవి గాని, బాలకృష్ణ గాని తమ మధ్య జరిగిన వివాదం పై బహిరంగంగా స్పందించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. దీంతో ఎవరికి తోచిన విధంగా వారు ఈ వ్యవహారం గురించి మాట్లాడుకుంటూ వస్తున్నారు. తాజాగా మరో వ్యవహారంతో వీరి మధ్య ఎటువంటి వాతావరణం ఉంది అనే విషయం తేలిపోనుంది. 

IHG


ఎందుకంటే జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఒక ప్రత్యేక విందును కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అలాగే అదే రోజు షష్టిపూర్తి మహోత్సవం కూడా ఉందట. ఈ విందుకు సినీ ఇండస్ట్రీకి చెందిన పెద్దలను పిలవాలని బాలయ్య నిశ్చయించుకున్నాడట. లాక్ డౌన్ నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే  ఈ వేడుకను నిర్వహించాల్సి ఉండడంతో, అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులను మాత్రమే బాలయ్య ఆహ్వానించబోతున్నార. ఈ విందుకు చిరంజీవిని కూడా ఆహ్వానించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పరిశ్రమలో చిరంజీవి బాలయ్య మొదటి నుంచి సన్నిహితంగా ఉంటూ వచ్చారు. ఓ సందర్భంలో బాలయ్య చిరు నేను మంచి స్నేహితులము అంటూ చెప్పారు. 

 


అలాగే చిరంజీవి కూడా అదే విషయాన్ని చెప్పారు. తాజాగా చిరు బాలయ్య మధ్య నెలకొన్న వివాదం నెలకొన్న నేపథ్యంలో బాలయ్య ఈ విందుకు చిరంజీవిని ఆహ్వానించినా, చిరంజీవి వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదానికి పులి స్టాప్ పెట్టాలి అంటే ఖచ్చితంగా బాలయ్య అచిరని పిలిచే అవకాశం ఉంటుంది. అయితే ఆయన వస్తారా లేదా అన్న దానిని బట్టే వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం బయట పడుతుంది. ఇప్పటికే చిరంజీవి బాలయ్య ను కలిసి ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టాలని చూస్తున్నారు. అనే వార్తలు బయటకు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో బాలయ్య ఆహ్వానిస్తే చిరంజీవి తప్పకుండా ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని, ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: