సాక్షి మీడియా.. ఇది ఏపీ సీఎం జగన్ సొంత మీడియా అన్న సంగతి అందరికీ తెలిసిందే. జగన్ అనుకూల వార్తలు, తెలుగుదేశం వ్యతిరేక వార్తలు అన్న పాలసీ కూడా బహిరంగమే..అందులో రహస్యం కూడా ఏమీ లేదు. కానీ.. అదే పనిగా జగన్ కు డబ్బా కొట్టనా జనం పెద్దగా పట్టించుకోరు.. అలాగని అదే పనిగా తెలుగుదేశాన్ని విమర్శించినా జనం లైట్ గానే తీసుకుంటారు.

 

 

అందుకే పత్రికలు ఏదైనా ఘటనను తమ పాలసీకి అనుగుణంగా మార్చుకుంటాయి. అమరావతి ప్రాంతంలో టీడీపీ భూ కుంభకోణాలకు పాల్పడిందని వైసీపీ నాయకులు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై సాక్షి కూడా బోలెడు కథనాలు వండి వార్చింది. అయితే తాజాగా దాన్ని చక్కగా ఎస్టాబ్లిష్ చేసే అవకాశం వచ్చినా పెద్దగా ఉపయోగించుకోలేదేమో అనిపిస్తోంది.

 

 

అమరావతిలో తెలుగు దేశం నేతల ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై ఇప్పటికే విచారణ సాగుతోంది. తాజాగా సీఆర్‌డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిని పోలీసులు అరెస్టు చేయడం కలకలం సృష్టించింది. సీఆర్‌డీఏ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కనికెళ్ల మాధురిని విజయవాడలోని ఆమె ఇంటి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె టీడీపీ నాయకుడు రావెల గోపాలకృష్ణ 3.11 ఎకరాలను ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చినట్టు చూపించారు.

 

 

అలా ఇచ్చినందుకు 3,100 చదరపు గజాలు కలిగిన 8 నివాస ప్లాట్లు, 770 చదరపు గజాలు కలిగిన రెండు వాణిజ్య ప్లాట్లను సీఆర్‌డీఏ ద్వారా రావెల గోపాల కృష్ణకు కేటాయించారు. అంతే కాదు.. మొత్తం ఐదున్నర లక్షల రూపాయల వరకూ కౌలు కూడా ఇచ్చారు. ఇలాంటి ప్రాముఖ్యత ఉన్న వార్తను కూడా సాక్షి పత్రిక పెద్దగా పట్టించుకోలేదు. ఎక్కడో లోపల పేజీలో చిన్న వార్త వేసి సరిపెట్టారు. తెలుగు దేశం అనుకూల మీడియా తరహాలోనే సాక్షి కూడా ఈ వార్తను పెద్దగా పట్టించుకోపోవడం ఆశ్చర్యకరమే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: