ఒక్కొక్కసారి దేవుడికి కూడా దయాదాక్షిణ్యాలు ఉండవు అనిపించే సంఘటనలు ప్రపంచంలో జరుగుతూనే ఉంటాయి. అలాంటి సంఘటన ఒకటి తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. పన్నెండేళ్లు బిడ్డలు లేరు అన్న బాధతో జీవిస్తున్న ఒక మహిళకు చివరకు కృత్రిమ గర్భధారణ వల్ల గర్భవతి కాగలిగింది. ప్రస్తుతం ఆవిడకి ఎనిమిది నెలలు. ఇంకేముంది కేవలం ఒక్క నెల దాటితే వారి పన్నెండేళ్ల బాధ తీరిపోతుంది. కానీ దేవుడు ఆ అదృష్టాన్ని వారి కుటుంబానికి ఇవ్వలేకపోయాడు. 

 

 

ఇక ఈ విషయం పూర్తి వివరాల్లోకి వెళితే... కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేగొండ గ్రామానికి చెందిన జూపాక కనకయ్యకు 13 సంవత్సరాల క్రితం స్వరూపతో వివాహం జరిగింది. అయితే ఆమె దురదృష్టం వల్ల వారికి పిల్లలు పుట్టలేదు. పిల్లల కోసం ఎక్కని హాస్పిటల్ లేదు, గుడి లేదు, భూత వైద్యులు లేరు, పండితులు లేరు, జ్యోతిష్కులు లేరు. ప్రతి చోట వారిని కలిసి వారికి పిల్లలు పుట్టాలని పూజలు, వ్రతాలు ఎన్నో చేశారు. అయితే 12 సంవత్సరాలు గడిచిన పోయిన తర్వాత ఆ జంటకు గత సంవత్సరం ఇంట్రా యుటెరిన్ ఇన్సెమినేషన్ (iui ) ద్వారా చికిత్స అందిస్తున్నడంతో అది కాస్తా ఫలించి ఆమెకు కృత్రిమ గర్భధారణ కలిగింది. అయితే మొదటి కాన్పు కావడంతో మల్లె పువ్వు లాగా చూసుకుంటున్న ఆమెను వారి అమ్మ గారి ఇంట్లో ఉంటూ డాక్టర్ల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటుంది. 

 


కానీ నిజానికి ఏం జరిగిందో ఏమో కానీ ఉన్నఫలంగా స్వరూప కు ఛాతినొప్పి వచ్చింది. దీనితో హడావిడిగా ఆమెను హుజురాబాద్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విషమంగా ఉన్న ఆమె ప్రాణం గాల్లో కలిసి పోవడంతో ఆస్పత్రిలో ఆహారాలు మిన్నంటాయి. ఓవైపు వారి బిడ్డ చనిపోయిందని అనుకుంటున్నా దుఃఖంలో ఉన్న కుటుంబీకులు స్వరూప కడుపులో ఉన్న బిడ్డ కాపాడుకుందామని వైద్యులు సర్జరీ చేయించారు. అయితే అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఆపరేషన్ చేసి చూస్తే స్వరూప కడుపులో ఇద్దరు కవలలు ఉన్నారు. వారు కూడా చనిపోయారు. ఇంకేముంది చెప్పండి మాటలకందని ఆ బాధ ఎలా రాయాలో కూడా అర్థం అవ్వట్లేదు. కేవలం ఇంకొక్క నెల గడిచి ఉంటే పిల్లల్లేరు అనుకున్న వారి కుటుంబ సభ్యుల్లో డబుల్ ధమాకా లా ఇద్దరు కవల పిల్లలు జన్మించి వారి వారసత్వం కొనసాగించేవారు. కానీ దేవుడు ఆ అవకాశాన్ని ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: