ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున ప్రెస్ నోట్ విడుదల చేశారు. అందులో పంచభూతాలను కాపాడుకుందాం అంటూ ఈ నోట్ ని విడుదల చేశారు. ఇక సందేశంలో మన ఆరోగ్యం పర్యావరణం తోనే ముడిపడి ఉందని చక్కటి పర్యావరణ ఉన్నచోటే ఆసుపత్రులు అవసరం లేదని పెద్దలు అంటుంటారు అని తెలియజేసింది. అంతేకాకుండా జనసేన పార్టీ మూల సిద్ధాంతాలలో పర్యావరణానికి సముచిత స్థానం కల్పించిన సంగతి గుర్తు చేసింది. ఇక ఇందులో భాగంగానే " మనం నది - మన నుడి " అనే కార్యక్రమాన్ని చేపట్టింది. అకౌంట్ జూన్ 5వ తారీఖు అనగా ఈరోజుప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అని ఈ సంవత్సరంలో పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించుకోవాల్సింది రోజు ఇదే అని తెలియజేశారు. ఇక అలాగే ఈ సంవత్సరంలో పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించుకున్నట్లు అందువల్ల ఈ సందర్భంగా మీ అందరికీ చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ లో పేర్కొన్నాడు.

 


ప్రస్తుత పరిస్థితులు చక్కబడన తర్వాత " మన నది - మన నుడి " అనే కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందుకు తీసుకెళ్తామని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా ఆ కార్యక్రమం ద్వారా పర్యావరణానికి ఉపయోగపడే మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తామని ఆయన తెలిపారు. అంతేకాకుండా పర్యావరణాన్ని విషతుల్యం చేసే పరిశ్రమలపై నిరంతరం నిరసన గళం కొనసాగిస్తూనే ఉంటామని ఆయన తెలిపాడు. ఇకపోతే మనకు ఆరోగ్యప్రదాయిని అయినా పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించుకోవాలని కోరుతున్నానని మన అడవులు కొండలు నదులను మనమే కాపాడుకోవాలి అని ఆయన సూచించారు. నిజానికి పర్యావరణం మన కంటికి కనిపించని విలువైన సంపద ఈ సంపదను మనం భావితరాలకు అందించాలి అని వారు ఆరోగ్యంగా జీవితాన్ని కొనసాగించాలని ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరఫున పర్యావరణ ప్రేమికులు అందరికీ శుభాభినందనలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: