విశాఖ పట్టణంలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లాక్ డౌన్ సమయం లో జరిగిన ఈ దుర్ఘటన వల్ల 12 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది క్షతగాత్రులయ్యారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి చనిపోయిన మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి భారీ స్థాయిలో నష్టపరిహారం ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. అప్పట్లో ఈ దుర్ఘటన జరిగిన టైములో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆగమేఘాల మీద స్పందించి...మృతులకు కోటి రూపాయలు పరిహారం ప్రకటించగా మిగతా బాధితుల ప్రాంతాలలో కొన్ని వేల రూపాయలు ప్రకటించడం జరిగింది.

 

ఈ ఘటనలో వెంటిలేటర్ల మీద ఉన్న వారికి కూడా భారీ స్థాయిలో నష్టపరిహారం అందించారు. అయితే ఎంత నష్టపరిహారం అందించిన పోయిన వారు తీసుకుని వచ్చే పరిస్థితి లేదు. ఇదిలా ఉండగా ఈ దుర్ఘటన విషయంలో తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యాయస్థానంలో విచారణ చేస్తున్న కమిటీలు నివేదికలు బోర్డుకి ఇస్తూ వస్తున్నాయి. ఇంతటి దుర్ఘటన జరగడానికి కారణం ఖచ్చితంగా కంపెనీ యొక్క నిర్లక్ష్యమే అని చాలా కమిటీలు తెలియజేస్తున్నాయి. దీంతో ఎన్‌జిటి ఇప్పటికే సంస్థ నుంచి డిపాజిట్‌ చేయించుకున్న 50 కోట్ల రూపాయల్ని, బాధితులకు పరిహారం కోసం, ఆ ప్రాంతంలో పర్యావరణ హిత కార్యక్రమాల కోసం వినియోగించాలని స్పష్టం చేసింది.

 

అంతేకాకుండా చట్టపరమైన అనుమతులు వచ్చాకే కంపెనీ పునఃప్రారంభించాలనీ, ఈ ఘటనపై వివిధ కమిటీలు విచారణ జరుపుతాయనీ పేర్కొంటూ కేసు తదుపరి విచారణను నవంబర్‌ మొదటి వారానికి వాయిదా వేసింది. మొత్తానికి ఈ కేసులో జరుగుతున్న పరిణామాలు విచారణ చేపడుతున్నా కమిటీలు ఇస్తున్న రిపోర్టులను బట్టి చూస్తే అన్ని ప్రాణాలు పోవటానికి చాలా మంది కుటుంబాల పాపం మూటగట్టుకున్నది కంపెనీ వారి నిర్లక్ష్యం వల్లే అని సమాచారం. అటువంటి ప్రమాదం జరుగుతున్న టైంలో కనీసం సైరన్ మోగించకుండా  విషవాయువు ఐదు కిలోమీటర్ల మేరకు వ్యాపించిన సిబ్బందిలో స్పందన లేకపోవడం కంపెనీ వైఫల్యానికి నిదర్శనమని రిపోర్టుల్లో నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: