ఈ మద్య సైబర్ మోసగాళ్ళు తమదైన స్టైల్లో మోసాలకు తెగబడుతున్నారు.  టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది హ్యాకర్స్ కోట్లు కొల్లగొడుతున్నారు.  ఇక సైబర్ నేరగాళ్లు అమాయకులను దారుణంగా దోచుకుంటున్నారు.  తాజాగా బుల్లితెర‌పై సంచ‌ల‌నం క్రియేట్ చేసిన క్విజ్ షో కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి. అమితాబ్ బ‌చ్చ‌న్ హోస్ట్‌గా రూపొందిన ఈ కార్య‌క్ర‌మం ఇప్ప‌టికే 11 సీజ‌న్స్ పూర్తి చేసుకొని 12వ సీజ‌న్ లోకి అడుగుపెట్టేందుకు సిద్ధ‌మైంది. మే 9 న రాత్రి 9గం.ల నుండి  రిజిస్ట్రేష‌న్ ప్రారంభం కాగా, అంద‌రు  రిజిస్ట్రేష‌న్ చేసుకోండి అని అమితాబ్ ఇటీవ‌ల‌ వీడియో ద్వారా తెలిపారు.  ఈ కార్యక్రమం.. త్వ‌ర‌లోనే ఈ షో సోనీ టీవీలో ప్ర‌సారం కానుంది.

 


ఇక దీన్ని కొంత మంది సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.  రిజిష్ట్రేషన్ పేరు తో కొంత మంది కేటుగాళ్లు తయారయ్యారు.   కౌన్ బ‌నేగా కరోడ్ ప‌తి షో పేరుతో ఓ మ‌హిళ‌కి 2,65,000 కుచ్చుటోపీ వేశాడు ఓ దుండ‌గుడు. పోసానిపేటకి చెందిన మంగళపల్లి లక్ష్మీకి మార్చి 7న కౌన్‌ బనేగా కరోడ్‌పతి నుండి రూ.25 లక్షలు గెలుచుకున్నావని ఫోన్ చేశారు దుండగులు. ఆ రూ.25 లక్షలు పొందాలంటే ముందుగా రూ. 2.65 లక్షలు చెల్లించాలని షరతు పెట్టారు. 

 


అయితే ఆమె రూ.25 లక్షలకు తనకు వస్తాయని గుడ్డిగా నమ్మింది.. అంతే కాదు ఈ డబ్బు లు కూడా త్వరలో మీ అకౌంట్ లో వేస్తారని చెప్పడం.. రూ. 2.65 లక్షలు క్యాన్సల్ అవుతాయని చెప్పడంతో వారి మాటలకి మోసపోయిన మహిళ సైబర్‌ నేరగాళ్ళ అకౌంట్‌లో నగదు జమ చేసింది.  మే 31న మళ్ళీ కాల్‌ చేసి నగదు జమ చేయాలని తెలపడంతో తాను మోసపోయినట్టు గ్రహించింది సదరు మహిళ.  దీంతో వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: