సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి వైసిపి అధినేత సీఎం జగన్ ను కలవబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చిరంజీవికి పిలుపు వచ్చినట్లు సమాచారం. ఈనెల 09 తేదీన అమరావతి కి రావలసిందిగా చిరంజీవికి సీఎం ఆఫీస్ నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో చిరంజీవితో పాటు మరి కొంత మంది నిర్మాతలు అమరావతికి వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అయితే జగన్ తో భేటీ సందర్భంగా నందమూరి బాలకృష్ణను తీసుకువెళ్ళే విధంగా ఆయనకు సమాచారం అందించాలని చిరంజీవి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నిర్మాత సి.కళ్యాణ్ ద్వారా బాలయ్య కు సమాచారం పంపించినట్టుగా తెలుస్తోంది. 

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=REVIEW' target='_blank' title='review-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>review</a> On Jagan's Governance | Latest <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=ANDHRA PRADESH' target='_blank' title='andhra pradesh-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>andhra pradesh</a> ...


అలాగే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సినిమాలకు సంబంధించిన వ్యక్తులు మాత్రమే జగన్ తో భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ సినిమాటోగ్రఫీ మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చిరంజీవి బృందం భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి బాలకృష్ణను పిలవక పోవడంతో ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేయడం, దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగడం తెలిసిందే. ఇప్పటికీ ఈ దుమారం చల్లారలేదు. పైగా తెలుగు సినిమా ఇండ్రస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోయి మరీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న సంగతి తెలిసిందే. 

 

ఇప్పటికే ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టాలని సినీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మళ్ళీ ఇప్పుడు ఆ వివాదాన్ని చక్కదిద్దే అవకాశం వచ్చినట్టుగా కనిపిస్తోంది.ఇప్పుడు జగన్ తో భేటీ కి సంబంధించి బాలయ్యను పిలవాలి అని చిరంజీవి డిసైడ్ అవ్వడంతో ఆయన ఈ భేటీకి వస్తారా లేదా అనేది సందేహంగా మారింది. ఒకవేళ బాలయ్య చిరు బృందంతో వెళదామని చూసినా రాజకీయ పరంగా జగన్ బద్ద శత్రువు కావడంతో జగన్ దగ్గరకు బాలయ్య వెళ్లాలంటే దానికి తెలుగుదేశం పార్టీ అనుమతి కూడా కావాల్సి వస్తుంది. మరి ఈ విషయంలో బాలయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: