వైసీపీ పార్టీ నాయకురాలు ఏపీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మామ మాజీ మంత్రి శత్రుచర్ల చంద్రశేఖరరాజు తీవ్ర స్థాయిలో వైసీపీ పార్టీ పై విమర్శలు కురిపించారు. పెన్షన్ విషయం లో అర్హత ఉన్నా గాని ఇవ్వకుండా వైసీపీ పార్టీ వారికే పెన్షన్లు ఇస్తున్నారని సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీంతో డిప్యూటీ సీఎం మామ ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో వైసిపి పార్టీ పై నాయకుల పై రాజకీయంగా ఒత్తిడి మొదలయ్యింది.

IHG

ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న శత్రుచర్ల నియోజకవర్గంలో ఎక్కడ సరైన రోడ్లు లేవని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మొక్కుబడిగా సాగుతున్నాయని అన్నారు. అంతేకాకుండా సాగునీటి ప్రాజెక్టులు ఆగిపోయాయి. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో పార్టీ, మతం, కులం ఏమి చూడకుండా అందరికీ ఇల్లు ఇవ్వటం జరిగిందని, కానీ వైయస్ జగన్ మాత్రం పార్టీ చూసి మరి రాజకీయాలు చేస్తున్నారని కార్యక్రమాలు రూపొందిస్తున్నారని విమర్శలు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఎటువంటి అభివృద్ధి జరగలేదని త్వరలో ప్రజలంతా వైసీపీ ప్రభుత్వంపై తిరగబడటం గ్యారెంటీ అని హెచ్చరించారు.

IHG

జగన్ క్యాబినెట్ లో మంత్రి మామ అనటంతో వైసీపీ పార్టీ నాయకులు ఇరుకున పడినట్లయింది. వరుసగా పార్టీకి సంబంధించిన వాళ్ళు మరియు ప్రజాప్రతినిధుల బంధువులు విమర్శలు చేస్తున్న తరుణంలో పుష్పశ్రీవాణి మామ విషయంలో డీల్ చేయటానికి జగన్ రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో ముందుగా అధికారుల చేత అక్కడ విచారణ చేయించి అసలు అతని మాటల్లో నిజం ఉందో లేదో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోపక్క పుష్ప శ్రీ వాణి ని కూడా ఈ విషయంలో జగన్ ఇన్ వోల్వ్ చేయించనున్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: