లాక్ డౌన్ ముగియనున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా మరింత యాక్టివ్ కావాలని చూస్తున్నారు. ఇప్పటి వరకు సినిమాలు, లాక్ డౌన్ అంటూ పార్టీ కార్యక్రమాలు పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆయన ఇకపై పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని చూస్తున్నారు. దీనికి అనుగుణంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునేలా ప్లాన్ చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బలమైన పార్టీగా జనసేనను తీర్చిదిద్దాలని, బీజేపీతో కలిసి అధికారం దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పార్టీ కార్యక్రమాలు రూపొందించుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ తరపున ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు. పర్యావరణ పరిరక్షణ జనసేన సిద్ధాంతం అంటూ ఈ సందర్భంగా పవన్  పేర్కొన్నారు.

IHG


'' మానవజాతి సౌభాగ్యానికి పర్యావరణమే మూలం మానవ మనుగడకు ఆధారం పంచభూతాలు నింగి నీరు నేల గాలి తో సమ్మిళితమైన పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అప్పుడే మానవ జాతి శోభిల్లుతుంది.మన ఆరోగ్యం పర్యావరణం తోనే ముడిపడి ఉంది చక్కటి పర్యావరణ ఉన్న చోట ఆసుపత్రిలో అవసరమే ఉండదని అంటారు నిపుణులు. జనసేన మూల సిద్ధాంతాలు పర్యావరణ దానికి సముచిత స్థానం కల్పించిన సంగతి మీకు తెలిసిందే. పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానాన్ని జనసేన కాంక్షిస్తుంది. అందులో భాగంగానే " మన నది మన నుడి ". కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ రోజున జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం, పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయం తీసుకోవాల్సిన రోజు అందువల్ల ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులు చక్కదిద్దెందుకు మన నది, మన నుడి  అనే కార్యక్రమాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందుకు తీసుకు వెళ్తాము. 

 

పర్యావరణానికి అనుకూలమైన మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తాము. పర్యావరణాన్ని విషతుల్యం చేసే పరిశ్రమలపై నిరసన గళం వినిపిస్తూనే ఉంటాము. మనకు ఆరోగ్య ప్రదాయిని అయిన పర్యావరణాన్ని ప్రతి ఒక్కరూ పరిరక్షించాలని కోరుతున్నాను. మన అడవులు కొండలు నదులను మనమే కాపాడుకోవాలి. పర్యావరణం మనకు కంటికి కనిపించని విలువైన సంపద, ఆ సంపదను మన భావితరాలకు అందించాలి. వారికి ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాలి. పర్యావరణ దినోత్సవం సందర్భంగా నా తరఫున జనసేన పార్టీ తరఫున పర్యావరణ ప్రేమికులు అందరికీ శుభాభినందనలు " అంటూ జనసేన పార్టీ తరపున పవన్ లేఖను విడుదల చేశారు. ఇక సరికొత్త రీతిలో పవన్ ముందుకు వెల్తూ జనసేన లో మంచి ఊపు తీసుకురావాలని పవన్ ప్లాన్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: