బాలక్రిష్ణకు టాలీవుడ్లో ఏ హీరోకు లేని స్పెషాలిటీ ఉంది. అదేంటి అంటే బాలయ్య తెలుగు వారంతా ఆరాధ్యదైవంగా కొలిచే నందమూరి తారక రామారావు ముద్దుల తనయుడు. అసలు ఈ ట్యాగ్ చాలు బాలయ్య ఏ రంగంలోనైనా వీరంగం వేయడానికి. అయితే బాలయ్య స్వతహాగా మంచి హీరో. పైగా తండ్రి లాగానే  పక్కా మాస్ హీరో.

 

 

అలాగే అన్ని వేషాలు వేసి నవరసాలు పండించే ఆహార్యం ఉన్న హీరో. ఇపుడున్న ఏ హీరోకు లేని గొప్పతనం బాలయ్య సొంతం. ఇవన్నీ ఇలా ఉంటే బాలయ్యకు అపుడే అరవయ్యేళ్ళు వచ్చాయంటేనే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన తన ఫిజిక్ ని బాగా మెయింటైన్ చేస్తారు. ఇంకా చిన్నవారిలాగానే ఆయన దూకుడు ఉంటుంది. పాటల్లో, స్టెప్పుల్లో బాలయ్యకు సాటి లేరనిపించుకుంటున్నాడు.

 

 

ఇక బాలయ్య సినీ సీమలో తనదైన స్టైల్లో రాణిస్తున్నాడు. రాజకీయాల్లో బాలయ్య ఏ విధంగా ముందుకు వస్తాడా అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే బాలయ్య ఈ మధ్య ఇస్తున్న కొన్ని స్టేట్మెంట్స్ చూస్తూంటే బాలయ్య కచ్చితంగా సీరియస్ గా రాజకీయాల్లో రాబోతున్నాడని అంటున్నారు. నిజానికి అన్న గారు అరవయ్యేళ్ళకు రాజకీయాల్లోకి వచ్చి సంచలనం స్రుష్టించారు.

 

 

బాలయ్య సినిమాలు చేసుకుంటూ రాజకీయాలను ఇంతవరకూ పార్ట్ టైం గానే చేశారు. ఇపుడు మాత్రం బాలయ్య రాజకీయాలను కూడా సీరియస్ గా తీసుకుంటారని అంటున్నారు. దానికి ఉదాహరణగా బాలయ్య ఇటీవల ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీని కూకటి వేళ్ళతో పెకిలించివేస్తాను అంటూ గర్జించారు.

 

తాను తిరిగి టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి చేయాల్సింది అంతా చేస్తాను అని  కూడా చెప్పారు. అంటే బాలయ్య సీరియస్ గానే పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నట్లుగా అర్ధమవుతోందిగా. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీలో ఒక వ్యాక్యూం కూడా ఇపుడు ఉంది. చంద్రబాబు ఒక్కడే  పోరాడలేకపోతున్నారు.

 

ఆయన‌కు బాలయ్య తోడు అయి ముందు వరసలోకి వస్తే కచ్చితంగా టీడీపీకి మంచి ఊపు వస్తుంది. ఆ మీదట 2024 ఎన్నికల్లో ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎంత కాదనుకున్నా బాలయ్య ఎన్టీయార్ బ్లడ్ కాబట్టి కచ్చితంగా ఆయన వస్తే ఆ ఊపు టీడీపీకి వేరేగా ఉంటుందని  చెప్పనక్కరలేదు. మరి బాలయ్య తన 60 ఏట పుట్టిన రోజు సందర్భంగా కీలక ప్రకటలను చేస్తారా అని అంతా ఎదురుచూస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: